Site icon HashtagU Telugu

Prabhas : వాయిదాల ప్రభాస్.. బాహుబలి నుంచి ప్రతి సినిమా వాయిదా పడాల్సిందే..

Prabhas Movies Postponed Regularly from Bahubali Movie Fans Disappointed

Prabhas Movies Postponed Regularly from Bahubali Movie Fans Disappointed

ప్రభాస్(Prabhas) ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న హీరో. ప్రభాస్ ఫ్లాప్ సినిమా కూడా వందలకోట్ల కలెక్షన్స్ తెచ్చుకుంటున్నాయి. బాహుబలి(Bahubali)తో దేశమంతటా స్టార్ డమ్ తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత మాత్రం ఆ రేంజ్ హిట్ మళ్ళీ ఇప్పటివరకు కొట్టలేదు. దీంతో ప్రభాస్ అభిమానులు ఒక్క హిట్ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్(Salaar) సినిమాపై అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా అయినా ప్రభాస్ కి పాన్ ఇండియా హిట్ ఇస్తుందని భావిస్తున్నారు. కానీ ఈ సినిమా వాయిదా మీద వాయిదా పడుతుంది. గత సంవత్సరమే రిలీజ్ అనౌన్స్ చేసిన సలార్ వాయిదాలు వేసుకుంటూ వచ్చి సెప్టెంబర్ 28 నుంచి మరోసారి వాయిదా వేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

అయితే ప్రభాస్ సినిమా వాయిదా పడటం ఇదేమి కొత్త కాదు. గతంలో బాహుబలి ముందు కూడా పలు మార్లు ప్రభాస్ సినిమాలు వాయిదాలు పడ్డాయి. కానీ బాహుబలి నుంచి ప్రతి సినిమా వాయిదా పడుతూ వస్తుంది. బాహుబలి సినిమా రిలీజ్ ని 2014లో ప్రకటిస్తే వాయిదా పడుతూ 2015లో రిలీజ్ అయింది. బాహుబలి 2 సినిమా 2016లో రిలీజ్ చేస్తామని చెప్పి వాయిదా వేసి 2017లో రిలీజ్ చేశారు. ఇక సాహూ 2018 నుంచి 2019కి వాయిదా పడింది. రాధేశ్యామ్ అయితే 2020 నుంచి అనేక మార్లు వాయిదాలు పడుతూ 2022లో రిలీజ్ అయింది. ఆదిపురుష్ కూడా పలు మార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. 2021 నుంచి వాయిదా పడుతూ 2023లో రిలీజయింది సినిమా.

ఇప్పుడు సలార్ పార్ట్ 1 గత సంవత్సరం 2022 నుంచి వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా క్లారిటీ లేదు. కల్కి సినిమా కుడా 2024 సంక్రాంతికి అనౌన్స్ చేశారు. కానీ ఆ సినిమా కూడా వాయిదా పడింది. దీంతో ఇలా ప్రభాస్ ప్రతి సినిమా పలు మార్లు వాయిదా పడుతుండటంతో అభిమానులు మాత్రం తీవ్ర నిరాశ వ్యక్తపరుస్తున్నారు. తొందరగా సినిమాలు రిలీజ్ చేయమని కోరుకుంటున్నారు. ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో, ఇంకా ఎన్ని సార్లు వాయిదా పడతాయో చూడాలి. దీంతో కొంత మంది వాయిదాల ప్రభాస్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

 

Also Read : Bollywood: అట్లీ నెక్ట్స్ హీరో ఎవరు?