Prabhas – Anushka : ప్రభాస్ – అనుష్క కాంబో అందరికి ఫేవరేట్. వీరి కాంబోలో వచ్చిన బిల్లా, మిర్చి, బాహుబలి 1, 2 సినిమాలు మంచి విజయాలు సాధించాయి. బయట కూడా ఈ పెయిర్ చూడటానికి చాలా బాగుంటుంది. గతంలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ అబద్దం అని మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని వీళ్ళు క్లారిటీ ఇచ్చేసారు.
కానీ ప్రభాస్ – అనుష్క కాంబోకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీళ్లిద్దరు మళ్ళీ కలిసి నటిస్తే బాగుండు, కలిసి కనిపిస్తే బాగుండు అనుకుంటారు అభిమానులు. తాజాగా ప్రభాస్ అనుష్కను కలిశాడట.
ప్రస్తుతం అనుష్క డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఘాటీ సినిమా చేస్తుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి మాస్ గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ సినిమా షూటింగ్ సెట్స్ కు వెళ్లి ప్రభాస్ అనుష్క ను కలిసాడని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. అయితే వీరిద్దరూ కలిసినట్టు ఫోటోలు, వీడియోలు ఏమి బయటకు రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశచెందుతున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, హను రాఘవపూడి సినిమాలతో బిజీగా ఉన్నాడు.
Also Read : Vishwak Sen : నాకు 100 కోట్ల కలెక్షన్ కాదు.. 100 కోట్ల రెమ్యునరేషన్ రావాలి.. విశ్వక్ సేన్ కామెంట్స్