ప్రభాస్..ఈ కటౌట్ గురించి కొత్తగా..ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈశ్వర్ (Eswar ) మూవీ తో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్..ఆ తర్వాత వర్షం తో యూత్ కు దగ్గరయ్యాడు. వర్షం (Varsham) తో వచ్చిన క్రేజ్ తో వరుస ప్రేమ కథ చిత్రాలు చేసి లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఛత్రపతి తో మాస్ హీరోగా మరో అవతారం చూపించాడు. ఆ తర్వాత వెనుకకు చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
ఇక బాహుబలి (Baahubali) సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ మూవీ తర్వాత వరుస పెట్టి పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు. తాజాగా సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ కు సంబదించిన ఓ వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
ప్రభాస్ మంచి భోజన ప్రియుడు అని చాలామందికి తెలుసు. ఎన్నో రకాల వంటకాలను ఆయన కోసం ప్రత్యేకంగా వండి పెడుతుంటారు. షూటింగ్ సెట్లో ప్రభాస్ తనకోసం మాత్రమే కాదు.. తనతో ఉన్నవారందరికీ ఇంటి నుంచి భోజనం తెప్పించి..స్వయంగా వాటిని వండించి తినిపిస్తుంటాడు. ప్రభాస్ ఇంటికి వెళ్లినవారికి దగ్గరుండి మరీ భోజనం వడ్డిస్తారని చాలామంది సినీ ప్రముఖులు చెపుతుంటారు. ముఖ్యంగా ప్రభాస్ కు ఎంతో ఇష్టమైన వంటకాల్లో ఒకటి నాటుకోడి పులుసు. ఆ పులుసులో గారెలు నంచుకొని భలే ఇష్టంతో తింటారట. నాటుకోడి ఎన్ని రకాలుగా వండినా వద్దనుకుండా తింటాడట. దాంతోపాటు మాగాయి పచ్చడి, వాళ్ల అమ్మచేసే పప్పు కూడా బాగా ఇష్టపడతారట.
ఇక ప్రభాస్ కోసం ఓ స్పెషల్ కుకింట్ టీమ్ ఉంటుందని అంటారు. వీళ్లు ప్రభాస్ కి ఎప్పుడు ఏ ఫుడ్ కావాలో అడిగి ప్రత్యేకంగా ఆయన ఇష్టపడే విధంగా వండిపెడుతుంటారట. నాన్ వెజ్ లో ఎక్కువగా నాటుకోడి, చేపలు, రొయ్యలు, మటన్ తో ఎన్నోరకాల వెరైటీలు వండిపెడతారట. ఫుడ్ తో పాటు ప్రొటీన్స్ కి సంబంధించిన ఫుడ్ కూడా తింటారట. వీటి ఖరీదు రోజు దాదాపు 2 లక్షల వరకు (Prabhas Meal Cost) ఉండొచ్చు అని ఇండస్ట్రీ టాక్. నిజమే.. వెరైటీ వంటలకు ఆ మాత్రం ఖర్చు ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు.
Read Also : Pallavi Prashanth : హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న పల్లవి ప్రశాంత్..?