Site icon HashtagU Telugu

Prabhas Maruthi Movie : ప్రభాస్ మారుతి.. చేయాల్సింది చాలా ఉందా..?

Prabhas Maruthi Movie Compl

Prabhas Maruthi Movie Compl

రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి (Prabhas Maruthi Movie) కాంబోలో వస్తున్న సినిమా ఇప్పటివరకు 40 శాతం మాత్రమే షూటింగ్ పూర్తి చేసుకుందని టాక్. సినిమాను లాస్ట్ ఇయర్ ఎప్పుడో మొదలు పెట్టగా ఇప్పటివరకు సినిమా 40 శాతం మాత్రమే పూర్తయిందని న్యూస్ రావడం రెబల్ ఫ్యాన్స్ కి షాక్ ఇస్తుంది. అయితే ప్రభాస్ మారుతి సినిమా చేసే టైం లోనే అటు ఆదిపురుష్ ఇటు సలార్ రెండు సినిమాలకు డేట్స్ ఇచ్చాడు. ఆదిపురుష్ ఆల్రెడీ రిలీజ్ కాగా సలార్ పార్ట్ 1 రిలీజ్ వెయిటింగ్ లో ఉంది. దీవాళి లేదా వచ్చే సంక్రాంతికి సలార్ పార్ట్ 1 రిలీజ్ కన్ ఫర్మ్ అవుతుంది.

థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న మారుతి సినిమా ప్రభాస్ ఫ్రీ టైం లో షూటింగ్ చేస్తున్నాడని తెలుస్తుంది. మరోపక్క ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమాకు కూడా డేట్స్ ఇచ్చాడు. ఈ సినిమాలన్నీ ఉండటం వల్ల మారుతి సినిమా ఎప్పుడో మొదలైనా కూడా ఇంకా 40 శాతం షూటింగ్ జరిగిందని తెలుస్తుంది. కల్కి సినిమాకు కొంత పార్ట్ షూటింగ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం కమల్ ప్రభాస్ ల మధ్య సీన్స్ షూట్ చేస్తున్నారని తెలుస్తుంది.

కల్కి సినిమా పూర్తి చేశాకే మారుతి సినిమా (Prabhas Maruthi Movie)కు డేట్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు ప్రభాస్. ప్రభాస్ మారుతి సినిమాకు రాజా డీలక్స్, వింటేజ్ కింగ్ లాంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. మాళవిక మోహన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ కూడా సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది.

సినిమా సగానికి పైగా షూట్ చేయాల్సి ఉంది కాబట్టి దాదాపు 2024 ఎండింగ్ లోనే ఈ మూవీ రిలీజ్ ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు. మారుతి మాత్రం ప్రభాస్ సినిమాతో తన రేంజ్ పెంచుకోవాలని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నాడు.

Also Read : Akkineni Hero : అక్కినేని హీరో మళ్లీ అదే రిస్క్..!