Prabhas : ప్రభాస్ తో మారుతి.. బాషా రేంజ్ లో ఆ సీన్స్..!

Prabhas రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్

Published By: HashtagU Telugu Desk
Prabhas Maruthi Basha Range Flash Back Scenes

Prabhas Maruthi Basha Range Flash Back Scenes

Prabhas రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. సైలెంట్ గా షూటింగ్ చేస్తున్న ఈ సినిమా విషయంలో మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తుంది. అయితే లేటేస్ట్ గా సినిమా నుంచి ఒక లీక్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. అదేంటి అంటే మారుతి ప్రభాస్ సినిమాలో బాషా రేంజ్ లో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయట.

ఎన్ని సూపర్ ఫ్లాష్ బ్యాక్ సినిమాలు వచ్చినా వాటన్నిటికీ బాషానే రిఫరెన్స్ అని చెప్పొచ్చు. ఈ క్రమంలో మారుతి (Maruthi) కూడా ప్రభాస్ సినిమాలో ఆ రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఒకటి ప్లాన్ చేశారట. తప్పకుండా ఇది ఫ్యాన్స్ కి విజిల్స్ వేసేలా ఉంటుందని చెబుతున్నారు. బాషా (Basha) రేంజ్ ఫ్లాష్ బ్యాక్ అది ఆడియన్స్ కి కనెక్ట్ అయితే మాత్రం ప్రభాస్ సినిమా వేరే లెవెల్ లో ఉన్నట్టే అవుతుంది.

Also Read : Sachin Pilot Divorced : సారా అబ్దుల్లాకు విడాకులిచ్చిన సచిన్ పైలట్.. వాళ్ల లవ్ స్టోరీ అలా మొదలైంది!

మారుతి ప్రభాస్ కాంబో మొదట ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తపరచినా సినిమా షూటింగ్ నుంచి వచ్చిన లీక్డ్ ఫోటోస్ కొంత క్యూరియాసిటీని ఏర్పరిచాయి. ప్రభాస్ సలార్ (Salaar) డిసెంబర్ 22న రిలీజ్ అవుతుండగా సమ్మర్ కి కల్కి రిలీజ్ లాక్ చేశారు. మారుతి సినిమా రిలీజ్ ఎప్పుడు అన్నది ఇంకా డిసైడ్ చేయలేదు.

ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ అంచనాలకు తగినట్టుగానే ఈ సినిమా డిజైన్ చేశారని తెలుస్తుంది.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 01 Nov 2023, 07:33 AM IST