పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి (Prabhas Wedding) గురించి మళ్లీ చర్చ మొదలైంది. గతంలో అనేక రూమర్లు వచ్చినా, ఈసారి మాత్రం జాతీయ మీడియా నుంచి ఈ వార్త రావడం విశేషం. తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ వివాహం త్వరలోనే జరగబోతుందని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఈ పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయని, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి స్వయంగా పెళ్లి పనులు చేస్తోందని సమాచారం. ఇప్పటికే అనేక మంది హీరోలు పెళ్లి చేసుకుని సెటిలయ్యారు, కానీ 45 ఏళ్ల వయసులోనూ ప్రభాస్ ఒంటరిగా ఉండటం కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేస్తూ వస్తుంది.
Rohit Sharma Captaincy: ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటాడా లేదా?
ప్రభాస్ పెళ్లి గురించి గతంలో అనేక ఊహాగానాలు వచ్చాయి. ప్రముఖ హీరోయిన్ అనుష్కతో ఆయన వివాహం ఖరారైనట్లు వార్తలు వచ్చినా, అది వాస్తవం కాకుండా పోయింది. అంతేకాదు ప్రభాస్ వివాహానికి సంబంధించిన అనేక ఫోటోలు, కథనాలు సోషల్ మీడియాను ఊపేశాయి. అయితే ఇప్పటివరకు అతని పెళ్లికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈసారి జాతీయ మీడియా కధనాల్లో ఈ వివాహం ఖాయమని, పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ప్రభాస్ కుటుంబ సభ్యులు ఎలాంటి స్పందన ఇస్తారన్నది చూడాలి. గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు అవన్నీ రూమర్లేనని కొట్టి పారేశారు. కానీ ఇప్పుడు పెద్దమ్మ శ్యామలాదేవి స్వయంగా పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటున్నట్లు వార్తలు రావడం ఆసక్తి కలిగిస్తోంది. ఇది నిజమేనా లేదంటే మరోసారి ఫేక్ న్యూసేనా అన్నది తెలియాలంటే ప్రభాస్ ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.