CM Revanth Reddy-Prabhas : ప్రభాస్ పై ప్రశంసలు కురిపించిన సీఎం రేవంత్ ..

‘ దేశంలో పలు రంగాల అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర ఎంతో ఉంది. సినీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తుల్లో కృష్టం రాజు ఒకరు.

Published By: HashtagU Telugu Desk
Revanth Prabhas

Revanth Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రశంసల జల్లు కురిపించారు. ప్రభాస్‌ది.. టాలీవుడ్. బాలీవుడ్ కాదు.. హాలీవుడ్ రేంజ్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అభినందన సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘ దేశంలో పలు రంగాల అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర ఎంతో ఉంది. సినీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తుల్లో కృష్టం రాజు ఒకరు. ఆయన పేరు లేకుండా తెలుగు సినిమా పేరు చెప్పలేం. కృష్ణంరాజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఇక హాలీవుడ్‌కి పోటీ ఇచ్చిన ‘బాహుబలి’ సినిమాని ప్రభాస్ లేకుండా ఊహించలేం’ అని చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్మ తనకు మంచి మిత్రుడంటూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లోనూ రాజులు ఉండాలి. పార్టీలో చేరి సేవలు చేస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశాలు కల్పిస్తాం. రిటైర్డ్ ఐఏఎస్‌ శ్రీనివాసరాజును ప్రభుత్వ సలహాదారుగా నియమించాం. ఆయన ద్వారా నన్ను కలిసి మీ సామాజిక వర్గానికి సంబంధించిన అంశాలపై చర్చించండి. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ సహా అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఫ్యూచర్ సిటీలో చేపట్టాం. హైదరాబాద్ లోని ఈ ఫ్యూచర్‌ సిటీలో మీరు (రాజులు) కూడా పెట్టుబడులు పెట్టండి. తెలంగాణ ప్రభుత్వం మీకు సహకారం అందిస్తుందని’ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ కామెంట్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Read Also : World War II Bomb : వరల్డ్ వార్ -2 నాటి బాంబు కలకలం.. 400 ఇళ్లు ఖాళీ

  Last Updated: 19 Aug 2024, 09:16 AM IST