Prabhas Looks: ప్రభాస్ లుక్ నెట్టింట వైరల్.. డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్

గత కొన్ని రోజులుగా రెబల్ స్టార్ ప్రభాస్ కి సంబంధించిన ఎన్నో విషయాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. దానికి రెండు కారణాలు ఉన్నాయి.

Published By: HashtagU Telugu Desk
Whatsapp Image 2023 02 12 At 19.55.55

Whatsapp Image 2023 02 12 At 19.55.55

Prabhas Looks: గత కొన్ని రోజులుగా రెబల్ స్టార్ ప్రభాస్ కి సంబంధించిన ఎన్నో విషయాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి హిందీ హీరోయిన్ కృతి సనన్ తో నిశ్చితార్ధం చేసుకోవడానికి రెడీ అయ్యారని. రెండోది జ్వరంతో ఇబ్బంది పడుతున్నారని. అలా ఎప్పటిలాగే ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రేమ పెళ్లి గురించిన వార్తలు వైరల్ కాగా.. ఆయన అనారోగ్యం బారిన పడ్డారనే న్యూస్ మాత్రం ప్రభాస్ అభిమానుల్లో ఆందోళన నింపింది. ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన ఆయన లుక్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇది చూసిన ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. ప్రభాస్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన ఫీవర్ గురించి అస్సలు ఆందోళన అవసరం లేదని ప్రభాస్ లేటెస్ట్ లుక్స్ చూస్తే అర్థమవుతుంది. తాజాగా కొంత మంది అభిమానులను కలిశారు ప్రభాస్. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో ప్రభాస్ స్టైలిష్ లుక్లో ఫుల్ హ్యాండ్సమ్ గా కనిపిస్తుండటం రెబల్ స్టార్ అభిమానుల్లో ఉన్న అనుమానాలకు తెర దించింది. ప్రభాస్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

  Last Updated: 12 Feb 2023, 09:59 PM IST