Site icon HashtagU Telugu

Prabhas : కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్..!

Prabhas Look Leak From Kannappa Movie Manchu Vishnu Productional Movie

Prabhas Look Leak From Kannappa Movie Manchu Vishnu Productional Movie

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన సొంత సినిమాలే కాకుండా మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న కన్నప్ప సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నాడు. కన్నప్ప సినిమాలో నందీశ్వరుడు పాత్రలో ప్రభాస్ సర్ ప్రైజ్ చేయనున్నాడు. ఐతే ఆమధ్య వచ్చిన కన్నప్ప టీజర్ లో ప్రభాస్ జస్ట్ రెండు సెకన్లు మాత్రమే అది కూడా ప్రభాస్ కళ్లని మాత్రమే చూపించారు. ఐతే లేటెస్ట్ గా కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్ లీక్ అయ్యింది.

నందీశ్వరుడు లుక్ తో ప్రభాస్ (Prabhas) లుక్ అదిరిపోయింది. ఐతే అంతగా క్లారుటీగా లేని ఈ ఫోటో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్ లీక్ అవ్వడంపై కన్నప్ప టీం షాకింగ్ లో ఉంది. ఈ లీక్ కు కారణమైన వారు ఎవరన్నది కనిపెట్టే పనుల్లో ఉన్నారు.

లీకుల బెడద తప్పట్లేదు..

స్టార్ సినిమాల నుంచి ఇలాంటి లీక్స్ చాలా కామన్ అయ్యాయి. ఎంత పకడ్బందీ ప్లాన్ చేసుకున్నా కూడా లీకుల బెడద తప్పట్లేదు. ఐతే కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్ లీక్ అవ్వడం గురించి టీం ఎలా స్పదిస్తుందో చూడాలి. మంచు విష్ణు (Manchu Vishnu) లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న కన్నప్ప ( Kannappa) సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా లో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ కూడా భాగం అవుతున్నారు.

టీజర్ తో నెగిటివిటీ మూట కట్టుకున్న కన్నప్ప పై మంచు విష్ణు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఐతే కన్నప్ప సినిమా రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా నిర్ణయించలేదు. సినిమా నుంచి ఈమధ్య సరైన అప్డేట్స్ కూడా రావట్లేదు.

Also Read : Nani Hit 3 : ఆ సినిమాకు కోట్లు పెట్టేస్తున్న నాని.. రిస్క్ అని తెలిసినా కూడా తగ్గట్లేదు..!