Prabhas Kannappa : శివుడిగా ప్రభాస్..వైరల్ గా మారిన పిక్స్

కొంతమంది ఏఐ టెక్నాలజీతో ప్రభాస్ కు శివుడి గెటప్ వేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు..ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Prabhas Kannappa

Prabhas Kannappa

ఆదిపురుష్ మూవీ లో రాముడిగా కనిపించిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas)..త్వరలో శివుడి (Shivudu) గా కనిపించబోతున్నాడా..? ప్రస్తుతం ఇదే సోషల్ మీడియా లో వైరల్ గా మారడమే కాదు ఏకంగా పిక్స్ ను సిద్ధం చేసి పోస్ట్ చేసారు. ప్రస్తుతం ప్రభాస్..వరుస పాన్ ఇండియా మూవీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ (Kannappa) మూవీ లో ప్రభాస్ శివుడిగా, నయనతార పార్వతి దేవి ల కనిపించబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.

ఈ క్రమంలో కొంతమంది ఏఐ టెక్నాలజీతో ప్రభాస్ కు శివుడి గెటప్ వేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు..ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. శివుని గెటప్‌లో ప్రబాస్ బావుండడంతో…నటన కూడా ఇరగదీస్తాడు అని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు రెబల్ స్టార్ అభిమానులు. అలాగే నయనతార కూడా ఇంతకు ముందు రెండుసార్లు పౌరాణిక పాత్రల్లో కనిపించి అదరగొట్టింది. ఇప్పుడు పార్వతిగా కూడా ఆమె బావుంటుందని అంటున్నారు. మరి నిజంగా వీరు కన్నప్ప మూవీ లో నటిస్తున్నారా లేదా అనేది మాత్రం అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు.

విష్ణు ‘క‌న్న‌ప్ప‌’ (Kannappa ) అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఈ సినిమా ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. . 24 ఫ్రేమ్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ఏవీఏ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ల‌పై అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సినిమాలో దేశ వ్యాప్తంగా పాపుల‌ర్ అయిన న‌టీన‌టులను ఎంపిక చేసారు. బాలీవుడ్ హీరోయిన్ నుపూర్ స‌న‌న్ (Nupur Sanon) హీరోయిన్‌గా ఫిక్స్ చేసారు. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఇంత‌లోనే ఈ ప్రాజెక్ట్‌కు భారీ షాక్ త‌గిలింది. ఈ సినిమాలో న‌టిస్తున్న హీరోయిన్ నుపూర్ స‌న‌న్ సినిమా ప్రారంభానికి ముందే ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుని షాక్ ఇచ్చింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా హీరో మంచు విష్ణు వెల్ల‌డించారు. కాల్షీట్లు సర్దుబాటు చేసుకోలేకపోవడం వల్ల నుపుర్ సనన్ తన సినిమా నుంచి తప్పుకున్నట్టు మంచు విష్ణు పేర్కొన్నారు. మరి నుపుర్ ప్లేస్ లో ఎవర్ని తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.

Read Also : Telangana Election Effect : బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు

  Last Updated: 05 Oct 2023, 11:34 AM IST