Site icon HashtagU Telugu

Prabhas Kalki : కల్కి మాస్టర్ ప్లాన్.. మొత్తం 9 భాగాలా.. రెబల్ ఫ్యాస్ మైండ్ బ్లాంక్ అయ్యే న్యూస్..!

Prabhas Kalki will Come in 9 Parts Nag Aswin Huge Planning

Prabhas Kalki will Come in 9 Parts Nag Aswin Huge Planning

Prabhas Kalki రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా నుంచి ఒక న్యూస్ ఫ్యూజులు అవుట్ అయ్యేలా చేస్తుంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న కల్కి సినిమా వైజయంతి మూవీస్ 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దీపిక పదుకొనె హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే. సినిమాలో కమల్ హాసన్ విలన్ గా చేస్తున్నాడు. కల్కి 2898 ఏడి సినిమా మొదటి పార్ట్ గా వస్తుందని.. సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని అంటున్నారు.

ఐతే లేటెస్ట్ గా కల్కి ఒకటి రెండు పార్టులుగా కాదు ఏకంగా 9 భాగాలుగా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. ఇదేదో మార్వెల్ సీరీస్ లుగా నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నాడా ఏంటని ఆడియన్స్ అనుకుంటున్నారు. కల్కి సినిమా ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించనున్నాడు. టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న్ ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది.

కల్కి ప్రస్తుతానికి రెండు భాగాలే అని చెబుతుండగా సినిమా ఇప్పుడు 9 భాగాలుగా వస్తుందని తెలుస్తుండగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ న్యూస్ విని ఓ పక్క సర్ ప్రైజ్ అవుతున్నారు. మరి కల్కి ఈ 9 భాగాల సీక్రెట్ ఏంటి అది ఎప్పుడు రివీల్ అవుతుంది అన్నది చూడాలి. ఈ సినిమాలో నాగ్ అశ్విన్ ఇంకెన్ని సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నాడు అన్నది తెలియాల్సి ఉంది.

Also Read : Heroines Back to Form : సీనియర్ భామలంతా తిరిగి ఫాం లోకి.. అనుష్క టు శృతి.. సమంత త్రిష కూడా.!