Prabhas Kalki : ప్రభాస్ సినిమా మిలియన్ డాలర్ల ప్రశ్న.. ఆన్సర్ ఎప్పుడు దొరుకుతుంది..?

Prabhas Kalki స్టార్ సినిమాలన్నీ సెట్స్ మీద ఉన్నప్పుడు ఫలానా డేట్ కి రిలీజ్ అని ప్రకటిస్తారు. తీరా రిలీజ్ డేట్ దగ్గర పడున్న టైం లో వాయిదా వేస్తారు. ఫ్యాన్స్ మాత్రం సినిమా రిలీజ్ డేట్ ఇచ్చారు కదా ఆ టైం కు వస్తుందని

  • Written By:
  • Publish Date - April 6, 2024 / 01:18 PM IST

Prabhas Kalki స్టార్ సినిమాలన్నీ సెట్స్ మీద ఉన్నప్పుడు ఫలానా డేట్ కి రిలీజ్ అని ప్రకటిస్తారు. తీరా రిలీజ్ డేట్ దగ్గర పడున్న టైం లో వాయిదా వేస్తారు. ఫ్యాన్స్ మాత్రం సినిమా రిలీజ్ డేట్ ఇచ్చారు కదా ఆ టైం కు వస్తుందని ఎదురుచూస్తుంటారు. స్టార్ సినిమా రిలీజ్ డేట్ వచ్చినా అది కచ్చితంగా వాయిదా పడుతుందని ఆడియన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. ఒక హీరో అని కాదు అందరు హీరోల సినిమాల పరిస్థితి ఇలానే ఉంది.

వీరిలో రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభాస్ లీడ్ రోల్ లో వచ్చే సినిమాలు రిలీజ్ వాయిదా పడటం చాలా కామన్ అయ్యింది. డిసెంబర్ లో సలార్ 1 తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కల్కి 2898 ఏడి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పీరియాడికల్ మూవీగా టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది. సినిమా లో దీపికా పదుకొనె, దిశా పటాని, అమితాబ్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ భాగం అవుతున్నారు.

నాగ్ అశ్విన్ ఈ సినిమాను ఒక అద్భుతమైన విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా మే 9న రిలీజ్ లాక్ చేశారు. మే రెండో వారం ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇలాంటి టైం లో కల్కి రిలీజ్ చేయడం అంత శ్రేయష్కరం కాదని మేకర్స్ ఆలోచిస్తున్నారు. కల్కి సినిమా మే 9 న తీసుకురావాలని అనుకుంటున్నా ఎన్నికల ఎఫెక్ట్ సినిమాపై పడితే కష్టమని భావిస్తున్నారు.

అయితే సినిమా వాయిదా వేసినా మరీ ఎక్కువ రోజులు అయితే ఇంపాక్ట్ పోతుందని అనుకుంటున్నారు. అందుకే కల్కి సినిమాను మే 9 నుంచి 30కి వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. మే ఎండింగ్ కి ఎలక్షన్స్ పూర్తయి ఉంటాయి కాబట్టి అప్పటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే మేకర్స్ అలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే కల్కి మే 9న వస్తుందా లేదా మే 30కి వాయిదా వేస్తారా అన్నది త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుంది. ఈ మిలియన్ డాలర్ల ప్రశ్నకు సమాధానం దొరకాలంటే చిత్ర యూనిట్ రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆగష్టులో పుష్ప, సెప్టెంబర్ లో ఓజీ, దసరా బరిలో దేవర వస్తుండగా మే నెల మిస్ చేయకూడదని మేకర్స్ అనుకుంటున్నారు.

Also Read : Parasuram: ఫ్యామిలీ స్టార్ రెస్పాన్స్ పై అలాంటి కామెంట్స్ చేసినా డైరెక్టర్ పరుశురాం?