Site icon HashtagU Telugu

Prabhas Kalki : కల్కి అతని వల్లే పెద్ద హిట్..!

Ashwini Dutt Kalki

Ashwini Dutt Kalki

Prabhas Kalki ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో ప్రభాస్ తో పాటుగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన విషయం తెలిసిందే. ప్రభాస్ కి ఎంత మాస్ ఇమేజ్ ఉన్నా సరే బాలీవుడ్ లో ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది అంటే అది అమితాబ్ వల్లే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఐతే ఇదే విషయాన్ని ప్రభాస్ కల్కి సినిమా నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత అశ్వనిదత్ కూడా ఒప్పుకున్నారు. రీసెంట్ గా సినిమా సక్సెస్ ని పురస్కరించుకుని ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్కి ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం అమితాబ్ అని అన్నారు.

ఐతే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నారు. వీడియో పూర్తిగా చూస్తే ఏముంది అంటే ప్రభాస్ తో పాటు అమితాబ్ కూడా ఈ సినిమాకు హైలెట్ అయ్యారు. ఆయన ఈ టైం లో ఇలాంటి రిస్క్ చేసి నటించడం మరో గొప్ప విషయమని అన్నారు.

ఈ సినిమా క్రెడిట్ తాను కాదు ప్రభాస్ ని అడిగినా అది అమితాబ్ కే ఇచ్చేస్తారని అన్నారు అశ్వని దత్. మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ గా అనిపించినా ఎలాగు కల్కి పడేది రెబల్ స్టార్ ఖాతాలోనే కాబట్టి ఖుషిగా ఉన్నారు. కల్కి 2 సినిమా కూడా ఏమాత్రం లేట్ చేయకుండా 2025 సమ్మర్ కే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.

Exit mobile version