Site icon HashtagU Telugu

Kalki Collections : అక్కడ బాహుబలి రికార్డ్ దాటేసిన ‘కల్కి’.. RRR రికార్డ్ కూడా బ్రేక్ చేయడానికి రెడీగా ఉంది..

Prabhas Kalki Collections in USA Beat Bahubali and Salaar Records

Kalki Collections

Kalki Collections : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా, దిశా పటాని, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ.. ఇలా చాలా మంది స్టార్స్ నటించగా భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిన కల్కి సినిమాని అందరూ మెచ్చుకుంటున్నారు. మహా భారతం విజువల్స్, యాక్షన్ సీన్స్, హాలీవుడ్ టేకింగ్, కలియుగాంతానికి మహాభారతానికి లింక్ పెట్టి కథ.. ఇలా అన్ని ప్రేక్షకులని మెప్పిస్తున్నాయి.

దీంతో కల్కి సినిమా సూపర్ హిట్ టాక్ తో థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా కల్కి సినిమా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా నిన్న శనివారం వరకు మూడు రోజుల్లోనే 415 కోట్లు కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే అనేక చోట్ల కలెక్షన్స్ విషయంలో పలు రికార్డులు సెట్ చేస్తుంది కల్కి.

తాజాగా కల్కి సినిమా అమెరికాలో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. అమెరికాలో మన తెలుగు సినిమాలకు భారీ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. మన సినిమాలన్నీ అక్కడ మిలియన్ డాలర్స్ లో కలెక్షన్స్ వసూలు చేస్తాయి. కల్కి సినిమా ఇవాళ మధ్యాహ్నం వరకు నార్త్ అమెరికాలో ఏకంగా 10 మిలియన్ డాలర్స్ వసూలు చేసి అదరగొట్టింది. అంటే మన లెక్కల్లో దాదాపు 83 కోట్లు వసూలు చేసింది. అమెరికాలో హనుమాన్, బాహుబలి 1 సినిమాల రికార్డులని దాటేసింది కల్కి.

అమెరికాలో టాప్ 10 కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో బాహుబలి 2, RRR టాప్ ప్లేస్ లో ఉన్నాయి. బాహుబలి 1, సలార్, హనుమాన్ సినిమాలు తర్వాతి ప్లేస్ లో ఉండగా ఆ మూడు సినిమాల రికార్డులని కల్కి దాటేసింది. త్వరలో RRR సినిమా రికార్డ్ ని కూడా బ్రేక్ చేయనుంది కల్కి.

 

Also Read : Amitabh Bacchan : అమితాబ్ కి ఊపు తెచ్చిన కల్కి..!