Site icon HashtagU Telugu

Prabhas Kalki : కల్కి రిలీజ్.. ఇంత ఊగిసలాట ఎందుకు..?

Prabhas Kalki 2898AD Release Confusion Continues

Prabhas Kalki 2898AD Release Confusion Continues

Prabhas Kalki పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు నేషనల్ లెవెల్ లో అంచనాలు ఉన్నాయి. బాహుబలి నుంచి తన రేంజ్ పెంచుకున్న ప్రభాస్ సినిమా సినిమాకు డబుల్ ట్రిపుల్ క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. లాస్ట్ ఇయర్ చివర్లో సలార్ 1 తో మరో సెన్సేషన్ గా వచ్చిన ప్రభాస్ త్వరలో కల్కి 2898 ఏడిగా రాబోతున్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ 500 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ సినిమాను అసలైతే లాస్ట్ ఇయర్ లో రిలీజ్ చేయాల్సి ఉండగా ఈ సమ్మర్ కు వాయిదా వేశారు. మే 9 వైజయంతి బ్యానర్ కి లక్కీ డేట్ కాగా ఆరోజున కల్కి రిలీజ్ లాక్ చేశారు. అయితే మే 9న ప్రభాస్ కల్కి వస్తుందా అంటే మేకర్స్ చప్పుడు చేయట్లేదు. సినిమాకు సంబందించిన గ్రాఫిక్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని ఒక టాక్ నడుస్తుంది.

మరోపక్క ఏపీలోనూ.. నేషనల్ వైడ్ ఆ ఎలక్షన్స్ హడావిడి ఉండబోతుంది. ఆ టైంలో సినిమా రిలీజ్ చేస్తే అనుకున్నంత బజ్ వస్తుందా లేదా అన్న కన్ ఫ్యూజన్ ఉంది. ఈ కారణాల వల్లే కల్కిని ఆపుతున్నారు. మే 9న వస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఫిక్స్ అయినా కూడా మేకర్స్ మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు.

ప్రస్తుతం మేకర్స్ సినిమాను జూన్ ఎండ్ లో కానీ జూలైలో కానీ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కల్కి రిలీజ్ విషయంలో ఇంత ఊగిసలాట దేనికి అంటూ ఫ్యాన్స్ అంటున్నారు. అంటే వందల కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు సినిమా రిలీజ్ టైం చూసుకోవాల్సిందే. సరైన టైం కు వదిలితే సరికొత్త రికార్డులు సృష్టించే ఛాన్స్ ఉంటుందని మేకర్స్ నమ్మకం. మరి కల్కి రిలీజ్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Also Read : Ashu Reddy : సమంతను దించేసిన అషు రెడ్డి.. ఇద్దరు ఆ విషయంలో అస్సలు తగ్గట్లేదు..!