Kalki 2898AD: ఎన్నికల కారణంగా ప్రభాస్ మూవీ వాయిదా పడనుందా.. ఫాన్స్ కి నిరాశ తప్పదా?

  • Written By:
  • Publish Date - March 17, 2024 / 03:30 PM IST

టాలీవుడ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి నట దిగ్గజాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సలార్ తర్వాత త్వరలో మే 9న కల్కి 2898AD సినిమాతో రాబోతున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని అర్ధమవుతోంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఈ సినిమా గురించి పలు మార్లు మాట్లాడి అంచనాలు బాగా పెంచారు. అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా కల్కి 2898AD సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా మే 9న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ డేట్ కూడా క్యాన్సిల్ అయి వాయిదా పడేలా ఉంది.

త్వరలో దేశమంతా ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. నిన్నే ఎన్నికల డేట్స్ ప్రకటించగా ఏపీ, తెలంగాణలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల హడావిడి ఉంటే ఏ సినిమాలు రిలీజ్ కి ఆసక్తి చూపించవు. సగం మంది పార్టీల ప్రమోషన్స్ లో పాల్గొంటారు. కొంతమంది ఎన్నికల అరేంజ్మెంట్స్ బిజీలో ఉంటారు. అలాంటి టైంలో థియేటర్స్ కి వచ్చి సినిమా చూసేంత టైం ఎవ్వరూ ఇవ్వరు. అంతే కాకుండా ప్రభాస్ కల్కి రిలీజ్ డేట్ కి ఎన్నికల డేట్ కి కేవలం నాలుగు రోజులే గ్యాప్ ఉంది. దీంతో ఆ రోజు సినిమా రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ కూడా వర్కౌట్ అవ్వవు. సినిమా టికెట్ రేట్లు పెంచే అవకాశం కూడా లేదు. దేశమంతా ఎన్నికల సీజన్ కాబట్టి పాన్ ఇండియా కూడా వర్కౌట్ అవ్వదు. దీంతో ఇలాంటి టైంలో కల్కి లాంటి భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ చేస్తే నష్టాలు తప్పవు. అందుకే కల్కి సినిమాని వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. కచ్చితంగా ప్రభాస్ కల్కి సినిమా వాయిదా పడి ఎన్నికలు అయిన తర్వాత, ప్రభుత్వాలు ఏర్పడ్డాకే కల్కి సినిమా రిలీజయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రభాస్ అభిమానులకు నిరాశ ఎదురవుతుందేమో చూడాలి మరి.