Prabhas Kalki 2898AD ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా ఫస్ట్ గ్లింప్స్ తోనే వావ్ అనిపించగా సినిమాను కూడా నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. వైజయంతి బ్యానర్ లో 500 కోట్ల పైన బడ్జెత్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ తో పాటుగా దీపికా పదుకొనె, కమల్ హాసన్, అమితాబ్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు.
సినిమా మే 9న రిలీజ్ లాక్ చేశారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ మొత్తం ఐదు అవతరాల్లో కనిపిస్తరని తెలుస్తుంది. అంతేకాదు సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ప్రభాస్ కల్కి మొదటి భాగం కల్కి 2898 ఏడి కాగా రెండో భాగాన్ని కల్కి 3102 బిసి టైటిల్ తో రిలీజ్ చేస్తారట.
ప్రభాస్ తో పాటుగా ఈ సినిమాకు పనిచేస్తున్న వారంతా కూడా బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నారు. ప్రభాస్ ఈమధ్యనే సలార్ 1 తో సత్తా చాటాడు. అయితే కల్కి సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా తప్పకుండా ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలను మించి ఉంటుందని అంటున్నారు. ప్రభాస్ కల్కి ఐదు అవతారాల్లో మొదటి రెండు అవతారాలు మొదటి భాగంలో ఉంటాయని తెలుస్తుంది.