Site icon HashtagU Telugu

Kalki 2898 AD : హమ్మయ్య ఒక్క టికెట్ అయినా తెగింది.. ‘కల్కి’పై నో ఇంటరెస్ట్..

Prabhas Kalki 2898 Ad Ticket Bookings Are Too Poor

Prabhas Kalki 2898 Ad Ticket Bookings Are Too Poor

Kalki 2898 AD : సి అశ్విని దత్ నిర్మాణంలో దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి 2898 ఏడి’. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానితో పాటు మరికొంతమంది స్టార్ నటీనటులు నటిస్తున్నారు. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ మూవీగా వస్తున్న ఈ సినిమా పై టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

కానీ తమిళ్ ఆడియన్స్ మాత్రం కల్కిని అసలు పట్టించుకోవడం లేదు. ఈ సినిమా చూసేందుకు టాలీవుడ్ టు బాలీవుడ్ ఆడియన్స్ క్యూరియాసిటీ చూపిస్తుంటే.. తమిళియన్స్ మాత్రం నో ఇంటరెస్ట్ అనేస్తున్నారు. ఈ మూవీని ఈ నెల 27న రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ అయ్యిపోయాయి. ఇక ఈ సినిమాని మొదటి వారంలోనే చూసేందుకు ఆడియన్స్ ఉత్సాహం చూపిస్తూ బుకింగ్స్ చేస్తున్నారు.

ఇప్పటివరకు ఈ మూవీ ప్రీ బుకింగ్స్ 14వేలు దాటింది. ప్రీ బుకింగ్స్ లో ఇది రికార్డు అని చెబుతున్నారు. అయితే ఈ ప్రీ బుకింగ్స్ రికార్డు కేవలం తెలుగు వెర్షన్ వరకు మాత్రమే. అయితే తమిళ్ వెర్షన్ బుకింగ్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. అక్కడ మొత్తం 37 షోలకు తమిళ్ వెర్షన్ ని కొనుగోలు చేసారు. మూడు రోజుల్లో ఈ 37 షోల్లో ఒక్క టికెట్ కూడా తెగలేదు. రీసెంట్ గా ఎట్టకేలకు ఒక్క టికెట్ అమ్ముడుపోయింది.

మరి సినిమా రిలీజ్ సమయానికి తమిళియన్స్ ఏమైనా ఇంటరెస్ట్ చూపిస్తారా..? లేదా ఇలాగే నో ఇంటరెస్ట్ అంటారా..? చూడాలి. తమిళియన్స్ తెలుగు సినిమాని పట్టించుకోకుండా ప్రవర్తించడం ఇదేం కొత్త కాదు. గతంలో కూడా పలు టాలీవుడ్ బిగ్ మూవీస్ ని తమిళియన్స్ పట్టించుకోకుండా వదిలేసారు.