Site icon HashtagU Telugu

Kalki vs Double iSmart: ప్రభాస్ పై కన్నేసిన పూరి జగన్నాథ్

Kalki vs Double iSmart

Kalki vs Double iSmart

Kalki vs Double iSmart: ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో కంబ్యాక్ ఇచ్చిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ పేరుతో సీక్వెల్ తీస్తున్నాడు. రామ్ పోతినేని ఈ కేచిత్రం ద్వారా మాస్ హీరోగా మారిపోయాడు. రామ్ నటన, పూరి డైలాగ్స్ చిత్రాన్ని ముందుకు నడిపించాయి. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది ఈ చిత్రం. అయితే డబుల్ ఇస్మార్ట్ విడుదల తేదీ విషయంలో స్పష్టత లేకుండా పోయింది. అనుకున్న తేదీకి విడుదల చేసే పూరి ఈ సారి తేదీలో మార్పు చేయనున్నట్లు సమాచారం.

డబుల్ ఇస్మార్ట్ చిత్రం ప్రభాస్ కల్కి రిలీజ్ డేట్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మొదట ఈ సినిమాని శివరాత్రి కానుకగా మార్చి 8న విడుదల చేయాలని అనుకున్నారు. సినిమా అనౌన్స్ చేసినప్పుడే రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. కానీ సినిమాకు సంబంధించి ఇంకా పెండింగ్ వర్క్ ఉండడంతో మే నెలలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అది కూడా ‘కల్కి’ రిలీజ్ డేట్ అయిన 9 కి ‘డబుల్ ఇస్మార్ట్’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిసింది.

అయితే కల్కి సినిమా వాయిదా అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కల్కి రాకపోతే కల్కి రిలీజ్ డేట్ అయిన మే 9న డబుల్ ఇస్మార్ట్ వస్తుందని ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తోంది. కల్కి వాయిదా అంటూ ప్రచారం జరుగుతోంది కానీ.. కల్కి వాయిదా పడడం లేదు. మే 9న రావడం పక్కా అంటున్నారు. అదే జరిగితే డబుల్ ఇస్మార్ట్ మే నెలాఖరులో వచ్చే అవకాశం ఉందని సమాచారం. త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా సక్సెస్ పూరికి కీలకం. మరి.. డబుల్ ఇస్మార్ట్ తో సక్సెస్ సాధించి మళ్లీ ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.

Also Read: Hyderabad: హైదరాబాద్ లో నకిలీ కరెన్సీ తయారీ ముఠా అరెస్ట్