Site icon HashtagU Telugu

Ram Charan : రామ్ చరణ్ కూతురికి బుజ్జి బహుమతి పంపించిన కల్కి టీం..

Prabhas Kalki 2898 Ad Movie Team Send Gift To Ram Charan Daughter Klin Kaara

Prabhas Kalki 2898 Ad Movie Team Send Gift To Ram Charan Daughter Klin Kaara

Ram Charan – Kalki 2898 AD : ప్రభాస్ నటించిన ‘కల్కి 2898ఏడి’ ఈ నెలలో రిలీజ్ కాబోతుంది. అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ముద్దులు కూతురు ‘క్లీంకార’ పుట్టినరోజు కూడా ఈ నెలలోనే జరగబోతుంది. గత ఏడాది జూన్ 20న జన్మించిన క్లీంకార.. ఈ ఏడాదితో మొదటి పుట్టినరోజుని జరుపుకోబోతుంది. దీంతో ఈ ఫస్ట్ బర్త్ డేకి అయినా క్లీంకార ఫేస్ ని రివీల్ చేస్తారేమో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే, క్లీంకార పాపకి కల్కి మూవీ టీం నుంచి కాస్త ముందుగానే బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది.

కల్కి టీం క్లీంకారకి ఒక బుజ్జి బహుమతిని పంపించగా, దానిని ఉపాసన తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ అందరికి తెలియజేసారు. ఉపాసన షేర్ చేసిన స్టోరీలో క్లీంకార సైజు కల్కి కాస్ట్యూమ్, బుజ్జి రోబో బొమ్మ, కల్కి స్టిక్కర్స్, అలాగే ఒక లెటర్ కనిపిస్తుంది. ఇక తనకి వచ్చిన ఈ బహుమతిని క్లీంకార పరిశీలిస్తున్నట్లు ఆ స్టోరీలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇది గమనించిన నెటిజెన్స్ కి కొత్త కొత్త సందేహాలు వస్తున్నాయి.

సడన్ గా రామ్ చరణ్ కూతురికి కల్కి టీం ఎందుకు బహుమతి పంపింది. ఒకవేళ బర్త్ డే కారణంగా పంపారు అనుకున్నా.. పుట్టినరోజుకి ఇంకా సమయం ఉంది కదా. కొంపదీసి రామ్ చరణ్ కల్కి మూవీలో ఏమైనా గెస్ట్ అపిరెన్స్ ఇస్తున్నారా..? అనే డౌట్స్ ని వ్యక్తపరుస్తున్నారు. మరి కల్కి టీం ఏ ఉద్దేశంతో క్లీంకారకి బహుమతి పంపారో తెలియాలంటే.. వేచి చూడాల్సిందే. కాగా ఈ మూవీ ఈ నెల 27న రిలీజ్ కాబోతుంది.

నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని, బ్రహ్మానందం, పశుపతి వంటి స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. అలాగే మరికొంతమంది స్టార్స్ కూడా గెస్ట్ అపిరెన్స్ తో సర్‌ప్రైజ్ చేయనున్నారట.