Kalki 2898 AD : బాహుబలి స్టైల్‌లో కల్కి ప్రమోషన్స్.. ఈవారం మరో పాత్ర గ్లింప్స్ అప్డేట్..

బాహుబలి స్టైల్‌లో కల్కి మూవీ ప్రమోషన్స్. ఈవారం మరో పాత్ర గ్లింప్స్ అప్డేట్ రాబోతుందట.

Published By: HashtagU Telugu Desk
Prabhas Kalki 2898 Ad Movie Promotions Will Be Plan In Baahubali Style

Prabhas Kalki 2898 Ad Movie Promotions Will Be Plan In Baahubali Style

Kalki 2898 AD : బాహుబలి తరువాత ప్రభాస్ మళ్ళీ ఆ రేంజ్ లో చేస్తున్న సినిమా ‘కల్కి 2898 ఏడి’. హిందూ పురాణాల స్టోరీ లైన్ తో సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో.. దిశాపటాని, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, పశుపతి, రాజేంద్రప్రసాద్ వంటి స్టార్ కాస్ట్ తో పాటు మరికొంతమంది బడా తారలు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఇక ఈ ఒక్కో పాత్రని బాహుబలి స్టైల్ లో మేకర్స్ ఆడియన్స్ కి పరిచయం చేయబోతున్నారు. బాహుబలి మూవీలోని ముఖ్య పాత్రలను చిన్న గ్లింప్స్ తో రాజమౌళి ఆడియన్స్ కి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కల్కి మూవీలోని పాత్రని కూడా అలాగే ఆడియన్స్ కి పరిచయం చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారట. ఈక్రమంలోనే ఇటీవల అమితాబ్ పోషిస్తున్న అశ్వత్థామ పాత్రని గ్లింప్స్ తో ఇంట్రడ్యూస్ చేసారు.

అలాగే మిగిలిన పాత్రలను కూడా పరిచయం చేయనున్నారట. ఈక్రమంలోనే నెక్స్ట్ క్యారెక్టర్ కి సంబంధించిన గ్లింప్స్ అప్డేట్ ని ఈ వారంలోనే ఇవ్వనున్నారట. మరి తరువాత రాబోయే ఆ పాత్ర ఏంటో చూడాలి. కాగా ఈ సినిమాలో హిందూ పురాణంలో చెప్పబడిన సప్తచిరంజీవులు.. వేదం వ్యాసుడు, పరుశురాముడు, విభీషణుడు, హనుమంతుడు, అశ్వత్థామ, కృపాచార్య, బలి చక్రవర్తిని చూపించబోతున్నారు.

దీంతో ఈ ఏడు పాత్రలు ఎవరు పోషిస్తున్నారు అనేది ఆడియన్స్ లో ఎక్కువ క్యూరియాసిటీ నెలకుంది. కాగా ఈ మూవీలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాని, రాజమౌళితో పాటు ఎన్టీఆర్ కూడా గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారని ఫిలిం వర్గాల్లో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే.. వేచి చూడాల్సిందే.

Also read : Chiranjeevi : చిరంజీవి సినిమాలో నటించేందుకు.. నో చెప్పిన విజయశాంతి.. కారణం అదే..

  Last Updated: 24 Apr 2024, 08:25 PM IST