Kalki 2898 AD : ‘కల్కి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేట్ ఫిక్స్ అయ్యిందట.. ఎప్పుడంటే..?

ప్రభాస్ 'కల్కి' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేట్ ఫిక్స్ అయ్యిందట. ఎప్పుడు, ఎక్కడో తెలుసా..?

Published By: HashtagU Telugu Desk
Prabhas Kalki 2898 Ad Movie Pre Release Event Update Details

Prabhas Kalki 2898 Ad Movie Pre Release Event Update Details

Kalki 2898 AD : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘కల్కి 2898 AD’. హిందూ మైథలాజి కథతో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. కాగా ఈ మూవీని జూన్ లో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. సినిమా విడుదలకు మరో నెల మాత్రమే ఉండడంతో చిత్ర యూనిట్.. ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నడిపిస్తూనే, ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తూ వస్తున్నారు.

ఈక్రమంలోనే ఐపీఎల్ తో ప్రమోషన్ కంటెంట్ ని రిలీజ్ చేస్తూ.. ఇంటర్నేషనల్ ఆడియన్స్ వరకు రీచ్ అయ్యేలా చేస్తున్నారు. కాగా ప్రస్తుతం దేశమంతటా ఎన్నికల హడావుడి కనిపిస్తుంది. దీంతో కల్కి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అండ్ ప్రమోషన్స్ కి కొంచెం బ్రేక్ పడింది. అయితే నేటితో ఈ హడావుడి ముగియనుంది. ఆ తరువాత కల్కి వర్క్స్ అండ్ ప్రమోషన్స్ కూడా ఫుల్ స్వింగ్ లో సాగనున్నాయి. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగానే కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మేకర్స్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 22న గ్రాండ్ గా నిర్వహించబోతున్నారట. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట. ఎలక్షన్స్ హడావుడి ముగియగానే.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట. కాగా ప్రభాస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటే.. భారీ స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు ఈ గ్లోబల్ కంటెంట్ ఫిలింకి ఇంకే రేంజ్ లో ఉంటుందో అంటూ ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also read : Kannappa Teaser : కన్నప్ప టీజర్ రిలీజ్ అప్డేట్.. ప్రభాస్‌ ‘కల్కి’ స్టైల్‌లో..

  Last Updated: 13 May 2024, 06:10 PM IST