Kalki 2898 AD : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏపీలో అయితే ఓ రేంజ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో భారీ స్థాయిలో పోలింగ్ నమోదు అయ్యేలా కనిపిస్తుంది. తమ ఓటు హక్కుని ఉపయోగించుకోవడానికి ఆలోచించే ఓటర్స్.. ఖండాలు, దేశాలు, రాష్ట్రాలు దాటి ఏపీకి తరలి వస్తున్నారు. దీంతో ఎంప్లాయ్స్ లేక ఈ నాలుగు రోజులు కంపెనీస్ మూసి వేయాల్సి వస్తుంది.
ఇక ఈ ఎన్నికల ఎఫెక్ట్ ఐటీ కంపెనీస్ తో పాటు సినిమా పరిశ్రమ పై కూడా పడింది. ఓటు వేసేందుకు సినిమా పరిశ్రమలోని ఓటర్లు కూడా ఏపీకి బయలుదేరారు. దీని వల్ల ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కల్కి 2898 ఏడి’ పనులు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి. కల్కికి సంబంధించిన సీజీ వర్క్స్ హైదరాబాద్ లోని పలు కంపెనీస్ లో జరుగుతున్నాయి. ఇక ఈ ఎన్నికలు వల్ల ఆ కంపెనీలోని ఎంప్లాయ్స్ అంతా సెలవు పెట్టి ఏపీకి వెళ్లిపోయారు. దీంతో కల్కి సీజీ వర్క్స్ నిలిచిపోయాయని నిర్మాత పోస్ట్ వేశారు.
నిర్మాత స్వప్న దత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఉన్న ఫోటో షేర్ చేస్తూ.. తమ మధ్య జరిగిన సంభాషణని రాసుకొచ్చారు. సీజీ వర్క్ చేసేవారంతా ఎన్నికలు కోసం వెళ్లిపోయారని నాగ్ అశ్విన్ చెప్పగా.. స్వప్న ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని ప్రశించారు. దానికి నాగ్ అశ్విన్ బదులిస్తూ.. ఎవరు గెలిస్తే నాకెందుకు. నాకు నా సీజీ షాట్స్ ఎప్పుడు వస్తాయి అనేది కావాలి అంటున్నారు. ప్రస్తుతం ఈ స్టోరీ స్క్రీన్ షాట్ నెట్టింట వైరల్ అవుతుంది.
Kalki 2898 Ad
కాగా ఈ మూవీని జూన్ 27న రిలీజ్ చేసేందుకు మూవీ టీం డేట్ ని ఫిక్స్ చేసింది. సినిమాకి సంబంధించిన గ్రాఫిక్ వర్క్స్ ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయట. మరి ఆ టైంకి అన్ని పూర్తి చేసుకొని రిలీజ్ అవుతుందా..? లేదా మళ్ళీ వాయిదా పడుతుందా..? అనేది చూడాలి.