Site icon HashtagU Telugu

ప్రభాస్ ‘Kalki 2898 AD’ లుక్ వచ్చేసింది..అభిమానుల్లో పూనకాలే ..!!

Kalki Prabha

Kalki Prabha

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజాగా చిత్రాల్లో ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) ఒకటి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొణె, దిశా పటాని వంటి భారీ కాస్ట్ & క్రూ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫై ఏలంజిటి అంచనాలు నెలకొని ఉన్నాయో ఎంత చెప్పిన తక్కువే. ఇప్పటికే బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలై ఆశ్చర్య పరచగా…ఈరోజు మంగళవారం ప్రభాస్ తాలూకా లుక్ ను రివీల్ చేసి అభిమానుల్లో పూనకాలు తెప్పించారు.

We’re now on WhatsApp. Click to Join.

IPL సీజన్ లో భాగంగా మే 3న ముంబై, KKR మ్యాచ్ ఉంటుందని ప్రభాస్ తో చెప్పించి ఆకట్టుకున్నారు. కల్కి గెటప్ తో చెప్పించేసరికి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. వాస్తవానికి ఈరోజు ఉదయమే కల్కి అప్డేట్ వస్తుందని మేకర్స్ చెప్పేసరికి..ప్రభాస్ తాలూకా టీజర్ వస్తుంది కావొచ్చని అంత భావించారు..కానీ ఇలా ప్రభాస్ తాలూకా యాడ్ ను షేర్ చేసేసరికి కాస్త డిస్పాయింట్ అయినప్పటికీ..ఈ రకంగా అయినా ప్రభాస్ లుక్ చూసాం అని సంబర పడుతున్నారు.

ఇదిలా ఉంటె ఈ మూవీ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుంది. ప్రభాస్ కి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ తెలిసిందే. బాహుబలి నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ తెలుగులో తన రేంజ్ సినిమా సినిమాకు పెంచుకుంటూ వెళ్తున్నాడు. అందుకే ప్రభాస్ ప్రతి సినిమా ఇక్కడ సూపర్ బిజినెస్ చేస్తుంది. ఈ క్రమంలో కల్కి సినిమాకు కూడా తెలుగు రెండు రాష్ట్రాల్లోనే 200 కోట్ల దాకా బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. ఇక ఓవర్సీస్ మార్కెట్ కూడా కల్కికి బాగా జరిగిందని టాక్. ఓవర్సీస్ లో 100 కోట్ల దాకా బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. ఇక రెస్టాఫ్ వరల్డ్ మొత్తం 300 కోట్ల దాకా బిజినెస్ చేసిందని టాక్. మొత్తంగా ప్రభాస్ కల్కి సినిమా 500 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరిగిందని వినికిడి.

Read Also : Brs Party: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలి : ఎర్రోళ్ల