Site icon HashtagU Telugu

Kalki 2898 AD : ఆగని కల్కి రికార్డుల మోత.. షారుఖ్ ఖాన్ రికార్డుని..

Prabhas, Kalki 2898 Ad, Shah Rukh Khan

Prabhas, Kalki 2898 Ad, Shah Rukh Khan

Kalki 2898 AD : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి 2898 ఎడి’. భారీ బడ్జెట్ తో అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని వంటి అగ్రతారలు నటించారు. జూన్ చివరి వారంలో రిలీజైన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా సత్తా చాటుతూనే ఉంది. ఈ నెల గ్యాప్ లో మరికొన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయ్యాయి. కానీ కల్కి ఇప్పటికి అదిరిపోయే బుకింగ్స్ ని అందుకుంటూ.. కొత్త సినిమాలకు పోటీ ఇస్తుంది.

బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రేంజ్ లో టికెట్స్ తెగుతుండడంతో.. కల్కి కలెక్షన్స్ లో కొత్త రికార్డులను సృష్టిస్తుంది. ఇప్పటికే రూ.1100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి రికార్డు సృష్టించిన ఈ చిత్రం.. తాజాగా మరో కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. అదేంటంటే.. అమెరికన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఇప్పటివరకు 18.5 మిలియన్ డాలర్స్ పైగా కలెక్షన్స్ ని నమోదు చేసింది. ఈ కలెక్షన్స్ తో కల్కి సినిమా నార్త్ అమెరికాలో ఇండియన్ టాప్ 2 గ్రాసర్‌గా నిలిచింది. మొన్నటివరకు ఈ రికార్డు 17.5 డాలర్స్ తో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ పై ఉంది. ఇప్పుడు ఆ కలెక్షన్స్ ని కల్కి క్రాస్ చేయడంతో రెండో స్థానం ప్రభాస్ కి దక్కింది.

అక్కడ మొదటి స్థానంలో కూడా ప్రభాస్ సినిమానే ఉంది. 20.7 మిలియన్ డాలర్స్‌తో బాహుబలి 2 మొదటి స్థానంలో నిలవగా, 18.5 మిలియన్ డాలర్స్ తో కల్కి రెండో స్థానంలో ఉంది. ఇలా నెంబర్ వన్ అండ్ టు రికార్డుల్లో తన సినిమాలనే నిలబెట్టి ప్రభాస్ సంచలనం సృష్టించాడు. కాగా బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి ఇంకా సందడి చేస్తూనే ఉంది. మరి భవిషత్తులో బాహుబలి రికార్డుని కూడా క్రాస్ చేసేస్తుందా లేదా చూడాలి.