Kalki 2898 AD : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి 2898 ఏడి’ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. గత నెల 27న రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ ని టాక్ ని అందుకుంది. దీంతో వర్షాలను, వరల్డ్ కప్ ని కూడా పక్కనబెట్టి సినిమా థియేటర్స్ కి క్యూ కట్టారు. ఇక హౌస్ ఫుల్ షోలతో బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. కేవలం తొమ్మిది రోజుల్లోనే 800 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది.
రెండు వారలు పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ప్రస్తుతం 1000 కోట్ల మార్క్ ని కూడా దాటేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పదిహేను రోజుల్లో కల్కి మూవీ రూ.543.35 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకున్నట్లు సమాచారం. గ్రాస్ కలెక్షన్స్ బట్టి చూస్తే దాదాపు 1100 కోట్లకు దగ్గరిలో ఉంది. ఇక ఈ రెండు వారాల కలెక్షన్స్ తో షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ మూవీ లైఫ్ టైం కలెక్షన్స్ ని బ్రేక్ చేసినట్లు తెలుస్తుంది. పఠాన్ లైఫ్ టైం నెట్ షేర్ కలెక్షన్స్ రూ.543.09 కోట్లు, గ్రాస్ కలెక్షన్స్ రూ.1055. అయితే కల్కి మూవీ టీం మాత్రం 1000 కోట్ల కలెక్షన్స్ పై ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వలేదు.
అయితే నేషనల్ మీడియా కూడా కల్కి, పఠాన్ ని క్రాస్ చేసేసిందని కథనాలు వేస్తుండడంతో ప్రభాస్ అభిమానులు నెట్టింట సందడి చేస్తున్నారు. పఠాన్ అయ్యిపోయింది, ఇక జవాన్ బ్యాలన్స్ ఉంది. దాని రికార్డుని కూడా కల్కి క్రాస్ చేసేస్తుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జవాన్ నెట్ కలెక్షన్స్ వచ్చి రూ.637.95. మరి కల్కి ఈ కలెక్షన్స్ ని అందుకుంటాడా లేదా చూడాలి.