Kalki Bhairava Anthem : ఎట్టకేలకు ‘కల్కి’ భైరవ యాంతం వీడియో సాంగ్ వచ్చేసింది..

ఎట్టకేలకు ‘కల్కి’ భైరవ యాంతం వీడియో సాంగ్ వచ్చేసింది. పాప్ సింగర్ దిల్జిత్ దోశాంజ్ తో కలిసి ప్రభాస్..

  • Written By:
  • Updated On - June 17, 2024 / 04:00 PM IST

Kalki Bhairava Anthem : ప్రభాస్ హీరోగా దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్‌ యాక్షన్ థ్రిల్లర్ గా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘కల్కి 2898 ఏడి’. సి అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 27న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ కోసం.. చిత్ర యూనిట్ ఓ ప్రత్యేక సాంగ్ ని సిద్ధం చేసింది. ఇండియన్ స్టార్ పాప్ సింగర్ దిల్జిత్ దోశాంజ్ (Diljit Dosanjh) తో పంజాబీ స్టైల్ లో ఓ సాంగ్ ని రెడీ చేసారు.

సంతోష్ నారాయణ్ సంగీతం అందించగా కుమార్ లిరిక్స్ రాసారు. దిల్జిత్ దోశాంజ్ పంజాబీ స్టైల్ లో పాటని పాడి అదుర్స్ అనిపించారు. ఇక వీడియో సాంగ్ లో దిల్జిత్ దోశాంజ్ తో పాటు ప్రభాస్ కూడా కనిపించి అభిమానులను అలరించారు. ఆ ప్రమోషనల్ వీడియో సాంగ్ ని మీరు కూడా చూసేయండి.

కాగా ఈ సాంగ్ ని నిన్న జూన్ 16నే రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ అనౌన్స్ చేసారు. కానీ రిలీజ్ చేయలేకపోయారు. దీంతో నేడు ఉదయం గం.11లకు వీడియో సాంగ్ ని రిలీజ్ చేస్తామంటూ అనౌన్స్ చేసారు. కానీ ఆ టైంకి రిలీజ్ చేయలేకపోయారు. దీంతో అభిమానులతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు పాన్ ఇండియా మూవీకి చేయాల్సిన ప్రమోషన్స్ చేయడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ సినిమాలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని, పశుపతి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఇతర పరిశ్రమకు చెందిన పలువురు స్టార్స్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారట. మరి ఆ స్టార్స్ ఎవరో తెలియాలంటే రిలీజ్ వరకు ఎదురు చూడాల్సిందే.