Site icon HashtagU Telugu

Rajinikanth – Prabhas : ప్రభాస్, రజినిని ఫాలో అవుతున్నాడా..?

Prabhas, Rajinikanth, The Raja Saab

Prabhas, Rajinikanth, The Raja Saab

Rajinikanth – Prabhas : సూపర్ స్టార్ రజినీకాంత్ భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా వైడ్ ఫేమ్ ని సంపాదించుకున్నారు. కేవలం ఇండియాలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. బాలీవుడ్ బడా స్టార్స్ కూడా అంతటి క్రేజ్ లభించలేదు. రజిని తరువాత మళ్ళీ అంతటి క్రేజ్‌ని, ఫేమ్‌ని సంపాదించుకుంది రెబల్ స్టార్ ప్రభాస్. ఇక తనకి వచ్చిన ఈ ఫేమ్ ని నిలబెట్టుకోవడం కోసం ప్రభాస్.. రజినీకాంత్ ని ఫాలో అయ్యిపోతున్నట్లు అనిపిస్తుంది.

బాహుబలితో పాన్ ఇండియా ఇమేజ్ ని సంపాదించుకున్న ప్రభాస్.. ఆ ఫేమ్ ని నిలబెట్టుకోవడం కోసం డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ని ఎంచుకుంటూ వెళ్తున్నారు. ఈక్రమంలోనే రజిని ఫిల్మోగ్రఫీని అనుసరిస్తున్నట్లు అనిపిస్తుంది. బాషాతో పాన్ ఇండియా ఇమేజ్ ని సంపాదించుకున్న రజినీకాంత్.. ఆ తరువాత ముత్తు, అరుణాచలం, నరసింహ సినిమాలతో కెరీర్ లో పీక్ స్టేజికి వెళ్లారు. ఇక ఆ సమయంలో చంద్రముఖి వంటి హారర్ మూవీ చేయడం అందర్నీ ఆశ్చర్యపరింది. రజినీకాంత్ వంటి బడా హీరో హారర్ మూవీ చేయడం ఏంటని కామెంట్స్ వచ్చాయి. అయితే ఆ మూవీ రిజల్ట్ రజిని కెరీర్ ఒక మైలు రాయిలా మిగిలిపోయింది.

ఇప్పుడు కెరీర్ లో పీక్ స్టేజిలో ఉన్న ప్రభాస్ కూడా రాజాసాబ్ వంటి హారర్ మూవీ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఇది రిస్క్ అని కొందరు అంటుంటే.. మరికొంతమంది మాత్రం రజిని చంద్రముఖిని చూపిస్తూ జరగబోయేది చూడండి అంటున్నారు. ఇలా ఈ ఒక్క మూవీ విషయంలో మాత్రమే కాదు, ఇతర సినిమా విషయాల్లో కూడా ప్రభాస్, రజినిని ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. డివోషనల్ టచ్ ఉన్న బాబా-ఆదిపురుష్, సైన్స్ ఫిక్షన్‌తో రోబో-కల్కి, గ్యాంగ్‌స్టార్‌గా కబాలి-సాహో.. ఇలా ప్రతి జోనర్ లో ప్రభాస్, రజినిని అనుసరిస్తున్నట్లు అనిపిస్తుంది. మరి ప్రభాస్ నిజంగానే రజినిని అనుసరిస్తున్నారా..? లేదా యాదృచ్చికం..? అనేది తెలియదు.