Prabhas : ఇదెక్కడి కనెక్షన్‌రా బాబు.. ప్రభాస్ ఇన్‌స్టా పోస్ట్‌కి పాయల్ రాజ్‌పుత్‌కి డార్లింగ్ లింక్..

ఇదెక్కడి కనెక్షన్‌రా బాబు. ప్రభాస్ ఇన్‌స్టా పోస్ట్‌కి పాయల్ రాజ్‌పుత్‌ పోస్టుకి డార్లింగ్ లింక్ అంటూ నెటిజెన్స్ పోస్టులు.

Published By: HashtagU Telugu Desk
Prabhas Instagram Story And Payal Rajput Video Post Gone Viral

Prabhas Instagram Story And Payal Rajput Video Post Gone Viral

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ నేడు ఒక చిన్న ఇన్‌స్టాగ్రామ్ పోస్టుతో పాన్ ఇండియా వైడ్ హాట్ టాపిక్ అయ్యిపోయారు. సోషల్ మీడియా నుంచి న్యూస్ ఛానల్ హెడ్ లైన్స్ వరకు అంతా ప్రభాస్ ఇన్‌స్టా స్టోరీ గురించి చర్చే. ప్రభాస్ తన ఇన్‌స్టా స్టోరీలో.. “డార్లింగ్స్, ఫైనల్లీ ఒక ముఖ్యమైన వ్యక్తి మన లైఫ్ లోకి రాబోతున్నారు. వెయిట్ చేయండి” అంటూ రాసుకొచ్చారు. ఇక ఇది చూసిన నెటిజెన్స్.. ఈ పోస్ట్ ప్రభాస్ పెళ్లి గురించా..? లేక సినిమా ప్రమోషన్..? అని తెగ ఆలోచిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే, కొంతమంది నెటిజెన్స్.. ప్రభాస్ చేసిన పోస్టుకి, టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌ చేసిన పోస్టుకి లింక్ పెడుతున్నారు. ఇంతకీ అసలు పాయల్ ఏం పోస్ట్ చేసారు. ఈ అందాల భామ నిన్న తన ఎక్స్ (X) అకౌంట్ లో ఓ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసింది. ఇక వీడియోకి క్యాప్షన్‌గా.. “నేను కచ్చితంగా మరొకరి డార్లింగ్ కాబోతున్నాను. మీకు ఏమైనా ఐడియా ఉందా..?” అంటూ రాసుకొచ్చారు. నిన్న పాయల్ చేసిన ఈ పోస్ట్, నేడు ప్రభాస్ చేసిన ఈ పోస్ట్ చూసేందుకు కొంచెం ఒకేలా అనిపిస్తుండడంతో.. నెటిజెన్స్ ఈ రెండిటికి లింక్ పెడుతున్నారు.

ఏదైనా సినిమా ప్రమోషన్ కంటెంట్ కోసం వీరిద్దరూ కలిసి పని చేసారా..? అందుకే ఇలా పోస్టులు వేసారా..? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అసలు వీరిద్దరి పోస్టులు వెనుక ఉన్న కారణం ఏంటో తెలియాలంటే.. వేచి చూడడం తప్ప మరో దారి లేదు. ప్రస్తుతం అయితే నెటిజెన్స్.. ఈ ఇద్దరి పోస్టులను జత చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు.

  Last Updated: 17 May 2024, 12:33 PM IST