Prabhas Helps Karthikeya RX 100 కార్తికేయ నటించిన భజే వాయు వేగం సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రశాంత్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్ జాగ్వార్ కారుని ఉపౌయోగించారని తెలుస్తుంది. సినిమా షూటింగ్ కోసం ఒక జాగ్వార్ కార్ నీడ్ అవ్వగా కార్తికేయ ప్రభాస్ ని అడిగితే మరో మాట మాట్లాడకుండా ప్రభాస్ ఇచ్చేశాడట.
కారు షూటింగ్ ఇస్తే ఏమవుతుందో అనే ఆలోచన లేకుండా డార్లింగ్ తన దగ్గర ఉన్న జాగ్వార్ ఎక్స్ ని కార్తికేయకు ఇచ్చాడట. ఈ విషయాన్ని హీరో కార్తికేయ చెప్పి సినిమాకు సపోర్ట్ చేసిన వారందరికీ థాంక్స్ అని చెప్పాడు. సో అలా కార్తికేయ భజే వాయు వేగం సినిమాకు ప్రభాస్ హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చాడన్నమాట.
కార్తికేయ భజే వాయు వేగం ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా కథ కథనం ఆడియన్స్ ని ఎంగేజ్ చేసిందని అంటున్నారు. అక్కడక్కడ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపించినా ఓవరాల్ గా సినిమా ఓకే అనేస్తున్నారు. కార్తికేయ భజే వాయు వేగం సినిమా తో మరో సక్సెస్ అందుకున్నాడు. యువ హీరోల్లో తన మార్క్ చూపిస్తూ వస్తున్న కార్తికేయ ప్రస్తుతం సరైన రూట్ లోనే ఉన్నాడని అనిపిస్తుంది
Also Read : Priyanka Jain Latest Photoshoot : ప్రియాంక మెరుపులు అదుర్స్.. తడిసిన అందాలతో పిచ్చెక్కిస్తున్న అమ్మడు..!