Site icon HashtagU Telugu

Prabhas: ప్రభాస్‌, హనురాఘవపూడి మూవీ స్టోరీ లైన్‌ లీక్.. ఆ విషయంలో భయపడుతున్న డార్లింగ్ ఫ్యాన్స్?

Mixcollage 29 Feb 2024 10 33 Am 3458

Mixcollage 29 Feb 2024 10 33 Am 3458

టాలీవుడ్ హీరో ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. కాగా ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ప్రస్తుతం డార్లింగ్ చేతిలో రాజాసాబ్, స్పిరిట్, సలార్ 2, కల్కి లాంటి సినిమాలు ఉన్నాయి. ఈ మూవీస్ లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రభాస్. కాగా గత ఏడాది సలార్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

అలాగే ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించనున్నాడు. అయితే ప్రాజెక్ట్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్‌ వార్త ప్రస్తుతం వచ్చింది. స్టోరీ లైన్ లీక్‌ అయ్యింది. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్‌తో హను రాఘవపూడి ఒక వార్‌ బేస్డ్ మూవీ చేయబోతున్నారని గతంలో ప్రచారం జరిగింది. కానీ దానికి కొనసాగింపుగా మరో క్రేజీ వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇది వార్‌ ప్రధానంగా సాగే లవ్‌ స్టోరీ అట. ఇందులో ప్రభాస్‌ సైనికుడిగా కనిపించే అవకాశం ఉందట. ఒక వైపు యుద్ధం, మరోవైపు లవ్‌ స్టోరీ ఇదే ఈ సినిమా మెయిన్‌ లైన్‌ అని తెలుస్తుంది. మరి ఆ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేశారనేది కథగా ఉంటుందట.

అయితే ఇదే ఇప్పుడు డార్లింగ్‌ ఫ్యాన్స్ ని కలవరానికి గురి చేస్తోంది. టెన్షన్‌ పెడుతోంది. యుద్ధం వరకు ఓకే, మళ్లీ ఆ లవ్‌ స్టోరీ ఏంటనేది వాళ్ల భయానికి కారణం. ప్రభాస్‌తో లవ్‌ స్టోరీ ఏంట్రా అంటున్నారు. ఇప్పటికే రాధేశ్యామ్‌ పెద్ద డిజాస్టర్‌ అయ్యారు. ప్రభాస్‌ని అలాంటి పాత్రలో చూడలేకపోయారు. మళ్లీ రాధేశ్యామ్‌ చేస్తారా ఏంటీ అంటూ ఆందోళన చెందుతున్నారు.

Exit mobile version