Prabhas : ప్రభాస్, హను రాఘవపూడి సినిమా పూజా కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్..!

ప్రభాస్, హను రాఘవపూడి సినిమా పూజా కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ అయ్యిందట. అలాగే మూవీ రెగ్యులర్ షూటింగ్ ని కూడా..

Published By: HashtagU Telugu Desk
Prabhas, Hanu Raghavapudi, Kalki 2898 Ad

Prabhas, Hanu Raghavapudi, Kalki 2898 Ad

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ తన చేతిలో ఉన్న ఒక్కో ప్రాజెక్ట్ ని పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. అయినాసరి ప్రభాస్ చేతిలో మరి అరడజనకు సినిమాలు ఉన్నాయి. సలార్ 2, కల్కి పార్ట్ 2, రాజాసాబ్, స్పిరిట్, హను రాఘవపూడి సినిమా.. ఇలా ఒకదాని తరువాత ఒకటి ప్రభాస్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రభాస్ ఆల్రెడీ రాజాసాబ్ షూటింగ్ స్టార్ట్ చేసారు. కల్కి మరియు స్పిరిట్ సినిమాలు స్టార్ట్ చేసేందుకు మరికొంచెం టైం తీసుకోనున్నారు. హను రాఘవపూడి సినిమాని మాత్రం.. రాజాసాబ్ తో పాటు షూటింగ్ జరుపుకుంటూ రానున్నారు.

కాగా ఈ మూవీని ఇప్పటివరకు అధికారికంగా అనౌన్స్ చేయలేదు. ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ కూడా ఈ సినిమా షూటింగ్ లోకి అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఫిలిం వర్గాలు చెబుతున్నాయి. ఆగష్టులో ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారట. అన్ని కుదిరితే ఆగష్టు నెల నుంచే రెగ్యులర్ షూటింగ్ ని కూడా ప్రారంభించనున్నారట. ఒకవేళ అది కుదరకుంటే, సెప్టెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నారట.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతుందట. హను రాఘవపూడితో సినిమా అంటే ఒక హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అని అందరూ భావించారు. కానీ హను రాఘవపూడి, ప్రభాస్ తో ప్రీ ఇండిపెండెన్స్ టైంలో వార్ నేపథ్యంతో సినిమాని తెరకెక్కించబోతున్నారట. ప్రీ ఇండిపెండెన్స్ టైంలో హైదరాబాద్ సంస్థానంలో రజాకార్ ఆధిపత్యం గురించి అందరికి తెలిసిందే. ఆ కథతో ఇటీవల ‘రజాకార్’ అనే సినిమా కూడా వచ్చి సూపర్ హిట్టుగా నిలిచింది. ఇప్పుడు ఆ కథనే తీసుకోని హను రాఘవపూడి తన స్టైల్ లో ప్రభాస్ సినిమాని తెరకెక్కించబోతున్నారట.

  Last Updated: 18 Jul 2024, 04:29 PM IST