Prabhas : ప్రేమ కథల స్పెషలిస్ట్ హను రాఘవపూడితో రెబల్ స్టార్ ప్రభాస్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టేజిలో ఉన్న ఈ మూవీని హను రాఘవపూడి ఏ జోనర్ లో తెరకెక్కించబోతున్నారు అనేది అందరిలో ఆసక్తిగా మారింది. తన బలమైన లవ్ స్టోరీ కాన్సెప్ట్ తోనే ప్రభాస్ సినిమా చేస్తారా..? లేదా మరేమైనా కొత్త నేపథ్యంతో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తారా..? అనే క్యూరియాసిటీ నెలకుంది. ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో హను రాఘవపూడి ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారని చెబుతున్నారు.
ఇక ఈ స్టోరీని ఒక కొత్త ప్రపంచంలో చూపించబోతున్నారట. ఆ ప్రపంచాన్ని సృష్టించడం కోసం.. దాదాపు వంద ఎకరాల్లో భారీ సెట్ ని నిర్మిస్తున్నారట. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వార్త ప్రభాస్ అభిమానులను సంతోష పరుస్తుంది. కాగా ఈ సినిమాకి ‘ఫౌజీ’ అనే టైటిల్ ని పెట్టినట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ ని ఈ నెల 17న పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయనున్నారని, సెప్టెంబర్ 21 నుంచి రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టబోతున్నారని చెబుతున్నారు.
అయితే చిత్ర నిర్మాతలను నుంచి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. మరి ఈ చిత్రాన్ని అధికారికంగా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి. కాగా ప్రభాస్ ప్రస్తుతం ‘రాజాసాబ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీతో పాటు ఈ చిత్రాన్ని కూడా షూట్ చేయనున్నారట. ఈ రెండు పూర్తీ అయిన తరువాత కల్కి అండ్ సలార్ సెకండ్ పార్ట్స్ ని ప్రారంభించనున్నారట.