Prabhas Kannappa : కన్నప్పకి డేట్స్ ఇచ్చిన ప్రభాస్.. మంచు విష్ణు ప్లానింగ్ అదే..!

Prabhas Kannappa మంచు విష్ణు లీడ్ రోల్ లో సొంత నిర్మాణంలో తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమాను 100 కోట్ల భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ మూవీని డైరెక్ట్

Published By: HashtagU Telugu Desk
Prabhas Given Dates For Manchu Vishnu Kannappa Rebal Star

Prabhas Given Dates For Manchu Vishnu Kannappa Rebal Star

Prabhas Kannappa మంచు విష్ణు లీడ్ రోల్ లో సొంత నిర్మాణంలో తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమాను 100 కోట్ల భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. మంచు విష్ణు చాలా ప్రెస్టీజియస్ గా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు.

We’re now on WhatsApp : Click to Join

ఈ సినిమా నుంచి ఆమధ్య వచ్చిన ప్రీ లుక్ పోస్టర్ అదుర్స్ అనిపించగా లేటెస్ట్ గా సినిమా నుంచి మరో న్యూస్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.

కన్నప్ప సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నాడని మంచు విష్ణు చెప్పాడు. అయితే ప్రభాస్ ఏడో మొహమాటానికి సినిమాలో నటిస్తానని చెప్పి ఉంటాడు. కన్నప్పలో ప్రభాస్ భాగం అయ్యే ఛాన్స్ లేదని అనుకున్నారు. కానీ లేటెస్ట్ ఇన్ ఫర్మేషన్ ప్రకారం కన్నప్ప కోసం కూడా ప్రభాస్ డేట్స్ అడ్జెస్ట్ చేస్తున్నాడు.

సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ ఉంటే సినిమాపై ఏర్పడే ఆ బజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.

ప్రభాస్ కన్నప్ప సినిమా కోసం 3 రోజుల డేట్స్ ఇచ్చాడట. ఫిబ్రవరి 17, 18, 19 ఈ మూడు రోజుల్లో ప్రభాస్ కన్నప్ప కోసం పనిచేస్తాడట. న్యూజిలాండ్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ప్రభాస్ కూడా అక్కడకు వెళ్లి కన్నప్ప షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తుంది.

కన్నప్ప సినిమాలో ప్రభాస్ రోల్ నిడివి ఎంత ఉంటుందో తెలియదు కానీ సినిమాలో ప్రభాస్ ఉన్నాడు అంటేనే బిజినెస్ జరిగిపోతుంది. ఈ సినిమాతో మంచు విష్ణు భారీ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read : Megastar Chiranjeevi Viswambhara Overseas Rights : విశ్వంభర టాప్ లేపిన ఓవర్సీస్ రైట్స్.. మెగా మాస్ బీభత్సం ఇది..!

  Last Updated: 28 Jan 2024, 05:04 PM IST