Site icon HashtagU Telugu

Prabhas Gift : గురువుకు గోల్డ్ బ్రాస్లైట్ వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చిన ప్రభాస్

Prabhas Gifts A Complete Go

Prabhas Gifts A Complete Go

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) మరోసారి తన గురుభక్తిని చాటుకున్నాడు. ఈశ్వర్ (Eswar ) మూవీ తో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్..ఆ తర్వాత వర్షం తో యూత్ కు దగ్గరయ్యాడు. వర్షం (Varsham) తో వచ్చిన క్రేజ్ తో వరుస ప్రేమ కథ చిత్రాలు చేసి లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఛత్రపతి తో మాస్ హీరోగా మరో అవతారం చూపించాడు. ఆ తర్వాత వెనుకకు చూసుకొనవరం లేకుండా పోయింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక బాహుబలి (Baahubali) సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ మూవీ తర్వాత వరుస పెట్టి పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు. తాజాగా సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్..తాజాగా తన గురువు కు గోల్డ్ బ్రాస్లైట్ వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చిన తన గురు భక్తిని చాటుకున్నాడు. ప్రభాస్ సినిమాల్లోకి రావాలి అనుకున్నప్పుడు వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ లో మెలుకువలు నేర్చుకున్నాడు. అయితే ఈయనకు ముందు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి నటులు కూడా ఆయన దగ్గర యాక్టింగ్ శిక్షణ తీసుకొని యాక్టింగ్ లో మెలుకువలు నేర్చుకున్నారు. అయితే వాళ్ల బాటలోనే ప్రభాస్ కూడా ఆయన దగ్గరికి వెళ్లి ఆయన దగ్గరే యాక్టింగ్ కి సంబంధించిన శిక్షణను తీసుకున్నాడు. అయితే ఇప్పుడు సలార్ సినిమా మంచి సక్సెస్ ని సాధించడంతో మరోసారి తన గురువు అయిన సత్యా నంద్ (Satyanandh) గారిని కలిసి ఆయనకి గోల్డ్ బ్రాస్లైట్ వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చి తన ఆనందాన్ని పంచుకున్నాడు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఇక సలార్ విషయానికి వస్తే.. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘సలార్: సీజ్‌ఫైర్’ చిత్రం డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. రవి బస్రూర్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ మూవీ నైజాంలో నాలుగు రోజుల్లోనే రూ. 50 కోట్లు షేర్ రాబట్టింది.

Read Also : Telangana IT: ఐటీకి ప్రాధాన్యత ఇస్తాం..ఫాక్స్‌కాన్‌ ప్రతినిధులతో సీఎం రేవంత్