Site icon HashtagU Telugu

Prabhas : రేపు సాయంత్రం తన బుజ్జిని పరిచయం చేస్తానంటున్న బుజ్జిగాడు..

Prabhas Gave Clarity About On His Instagram Post And Tomorrow He Introduce Kalki 2898 Ad Character

Prabhas Gave Clarity About On His Instagram Post And Tomorrow He Introduce Kalki 2898 Ad Character

Prabhas : టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ నేడు తన ఇన్‌స్టాగ్రామ్ ఒక చిన్న పోస్టు వేసి.. పాన్ ఇండియా వైడ్ దాని గురించి మాట్లాడుకునేలా చేసారు. ప్రభాస్ తన ఇన్‌స్టా స్టోరీలో.. “డార్లింగ్స్, ఫైనల్లీ ఒక ముఖ్యమైన వ్యక్తి మన లైఫ్ లోకి రాబోతున్నారు. వెయిట్ చేయండి” అంటూ పోస్ట్ వేశారు. ఇక ఇది చూసిన ప్రతి ఒక్కరు.. ప్రభాస్ పెళ్లి వార్తేమో అని ఎంతో ఆసక్తిని కనబరిచారు. కాగా ప్రభాస్ తాజాగా మరో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీతో ఆ పోస్ట్ వెనుక ఉన్న విషయాన్ని తెలియజేసారు.

ప్రభాస్ చేసిన ఈ పోస్ట్.. పెళ్లి గురించి కాదు, తన కొత్త సినిమా కల్కి గురించి. మూవీలో ప్రభాస్ తో పాటు ఉండే ఒక మెషిన్ గురించి ప్రభాస్ ఆ పోస్ట్ వేశారు. ఆ రోబో పేరు ‘బుజ్జి’ అంట. రేపు (మే 18) సాయంత్రం గం.5లకు ఆ బుజ్జిని పరిచయం చేస్తానంటూ మన బుజ్జిగాడు పోస్ట్ వేశారు. మరి ఆ బుజ్జి రోబోట్ ఎలా ఉండబోతుందో చూడాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే.

కాగా ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని వంటి స్టార్ కాస్ట్‌ కనిపించబోతుంది. అలాగే మరికొంతమంది స్టార్స్ కూడా గెస్ట్ అపిరెన్స్ ఇవ్వనున్నారట. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సి అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూన్ 27న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.