Prabhas Fight with Ram Charan and NTR స్టార్ సినిమాలేమో కానీ వారి రిలీజ్ డేట్ నిర్మాతలకు పెద్ద హెడేక్ గా మారింది. సినిమా రిలీజ్ డేట్ అని ఒక రోజు ప్రకటించడం ఆ డేట్ వచ్చే దాకా సైలెంట్ గా ఉండటం చివరకు తూచ్ ఆ డేట్ న మేము రావట్లేదంటూ మరో డేట్ ప్రకటించడం జరుగుతుంది. ఎన్.టి.ఆర్ దేవర ఏప్రిల్ 5న వస్తుందని అనుకుంటుండగా సినిమా రిలీజ్ దాదాపు వాయిదా పడుతుంది కాబట్టే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ లాక్ చేశారు.
ఇక మే 9న రిలీజ్ అనుకుంటున్న కల్కి సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి. అయితే కల్కి సినిమాను ఎలాగైనా అనుకున్న డేట్ కి తీసుకు రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలాఉంటే ఆగష్టు 15న పుష్ప 2 వస్తుందని ప్రకటించారు. దేవర ఏప్రిల్ 5న రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుంది కాబట్టి ఆగష్టు వస్తుందని అంటున్నారు. కానీ ఆగష్టు ఎలాగు పుష్ప 2 ఆక్యుపై చేశాడు కాబట్టి దసరాకి వస్తుందని టాక్.
ఇక దసరాకి రాం చరణ్ గేం చేంజర్ కూడా రిలీజ్ అనుకుంటున్నారు. ఎన్.టి.ఆర్ తో పాటు ఈసారి బాక్సాఫీస్ ఫైట్ లో చరణ్ కూడా పోటీ పడనున్నాడు. అయితే ఈ రెండు సినిమాలకు పోటీగా ప్రభాస్ సినిమా వస్తుంది అంటే ప్రభాస్ హీరోగా నటించిన సినిమా కాదు ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తున్న కన్నప్ప దసరాకి రిలీజ్ అంటున్నారు.
మంచు విష్ణు ఎంతో సాహసం చేసి చేస్తున్న ఈ సినిమా విషయంలో ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలో రిలీజ్ డేట్ కూడా దసరాకి అనుకుంటున్నారు. సో చరణ్, ఎన్.టి.ఆర్ సినిమాలతో కప్పన్న బరిలో దిగుతుంది.