Site icon HashtagU Telugu

Adipurush : జపాన్‌లో రిలీజ్ అవ్వలేదని.. సింగపూర్ వచ్చి ఆదిపురుష్ చూసిన ప్రభాస్ జపాన్ మహిళా అభిమాని..

Prabhas Female fan from Japan travelling to singapore for watching adipurush

Prabhas Female fan from Japan travelling to singapore for watching adipurush

ప్రభాస్(Prabhas) ఆదిపురుష్(Adipurush) రిలీజయి ఓ పక్క వివాదాలు సృష్టిస్తూ మరో పక్క కలెక్షన్స్ సాధిస్తుంది. దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నా ప్రభాస్ అభిమానులు మాత్రం తగ్గేదేలే అంటూ సినిమాకు వెళ్తున్నారు. ఇక ఆదిపురుష్ సినిమాని ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా రిలీజ్ చేశారు. ప్రభాస్ కి ఇండియా(India)తో పాటు బయటి దేశాల్లో కూడా భారీగానే అభిమానులు ఉన్నారు.

ముఖ్యంగా ప్రభాస్ కి జపాన్(Japan) లో అభిమానులు ఎక్కువ. ప్రభాస్ బాహుబలి, సాహో సినిమాలు జపాన్ లో భారీ విజయం సాధించాయి. జపాన్ లో ప్రభాస్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ప్రస్తుతం ఆదిపురుష్ ఇంకా జపాన్ లో రీలీజ్ అవ్వలేదు. దీంతో జపాన్ కి చెందిన ఓ ప్రభాస్ మహిళా అభిమాని ఆదిపురుష్ సినిమా చూడటానికి జపాన్ నుంచి సింగపూర్ వచ్చింది.

సింగపూర్ లో ఆదిపురుష్ సినిమా చూసిన అనంతరం అక్కడి ఇండియన్స్ ఈమెతో ఓ వీడియో తీసుకోగా ఆ వీడియో వైరల్ అయింది. వీడియోలో ఆ మహిళా అభిమాని మాట్లాడుతూ.. నా పేరు నోరికో. నేను జపాన్ నుంచి వచ్చాను ఆదిపురుష్ సినిమా చూడటానికి. ప్రభాస్ అభిమానిని, ప్రభాస్ అంటే ఇష్టం అని తెలుగులో చెప్పింది. చివర్లో ఆదిపురుష్ జెండా చూపించింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ప్రభాస్ అభిమానులు అయితే ఈ వీడియోని మరింత షేర్ చేస్తున్నారు.

 

Also Read : Narendra Modi : ‘నాటు నాటు’ సాంగ్ గురించి అమెరికా వైట్‌హౌస్ లో మాట్లాడిన మోదీ..