టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్,ఫౌజీ వంటి సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజి చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. బ్రిటిష్ నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి.
ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న ఒక్కొక్క వార్త కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో బ్రిటీష్ కాలం నాటి పరిస్థితులని ప్రతిబింబించేలా చూపించారు. ఈ మూవీలో ప్రభాస్ సైనికుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఫౌజి గురించి అదిరిపోయో అప్డేట్ వైరల్ గా మారింది. ఈ చిత్రంలో హను రాఘవపూడి తెలంగాణ నేపథ్యంలో రజాకార్లకి సంబంధించిన భారీ ఎపిసోడ్ ఒకటి ప్లాన్ చేశారట.
చిత్రంలో ఈ సన్నివేశం అత్యంత కీలకంగా భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. యాక్షన్, ఎమోషనల్ అంశాలతో ఈ సన్నివేశం ఉంటుంది. ఈ ఎపిసోడ్ కి చిత్ర యూనిట్ మొత్తం సిద్ధం అవుతోందట. వెండి తెర పై ఈ సీన్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉండాలని రాఘవపూడి టార్గెట్ గా పెట్టుకున్నారట. మార్చిలో ఈ సన్నివేశానికి సంబంధించిన షూటింగ్ జరగనుంది. అయితే ఇందులో మరో క్రేజీ అప్డేట్ ఏంటంటే ఈ సన్నివేశం కోసం ప్రముఖ హాలీవుడ్ నటుడిని రంగంలోకి దించుతున్నారట. ఆ హాలీవుడ్ నటుడు కొన్ని నెలలుగా ఈ చిత్రం కోసం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అతడి గురించి వివరాలు బయటకి రానున్నాయి.