Site icon HashtagU Telugu

Deepika Padukone : దీపికా ఫై డార్లింగ్ ఫ్యాన్స్ ఆగ్రహం..

Prabhas Fans

Prabhas Fans

సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)..ప్రస్తుతం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌ మూవీ చేస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్నాడు. గత కొద్దీ రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న చిత్ర యూనిట్..ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో బుజ్జిని పరిచయం చేసారు. భారీ ఈవెంట్ ప్లాన్ చేసి..అట్టహాసంగా బుజ్జిని పరిచయం చేసారు. అయితే ఈ ప్రమోషన్ కార్యక్రమానికి దీపిక రాకపోగా. కనీసం ఆన్‌లైన్‌లో కూడా మూవీని ప్రమోట్ చేయలేదు..అంతెందుకు ఇప్పటివరకు కూడా సినిమా గురించి పెద్దగా పోస్టు లు చేయడమా కానీ ప్రమోషన్ చేయడం కానీ చేయలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ దీపికా తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం దీపిక ప్రెగ్నెంట్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కనుక రియల్ టైమ్ ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటుంది. కానీ తన సోషల్ మీడియాలో సినిమా గురించి ఎందుకు ప్రమోట్ చేయడం లేదనేదే అభిమానుల ప్రశ్న. రీసెంట్‌గా టీజర్ రిలీజైనప్పుడు కూడా దీపిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో దాన్ని పోస్ట్ చేయడానికి రెండు రోజులు పట్టింది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుల గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. ఇప్పటివరకూ కల్కి గురించి కేవలం రెండు అంటే రెండు పోస్టులే పెట్టింది దీపిక. అందులో ఒకటి కల్కి మొదలైనప్పుడు కాగా రెండోది రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు పోస్ట్ చేసింది. ఇలా కల్కి సినిమా విషయంలో దీపిక చాలా లైట్‌గా ఉంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఇప్పటికైనా దీపికా కల్కి ఫై కాస్త శ్రద్ద పెడితే బాగుండు అని కామెంట్స్ వేస్తున్నారు.

Read Also : Indian players: రేపు అమెరికా వెళ్ల‌నున్న టీమిండియా ఆట‌గాళ్లు.. ఫ‌స్ట్ బ్యాచ్‌లో ఉన్న ప్లేయ‌ర్స్ వీరే..!