Ram Charan-Prabhas: చరణ్ పుట్టినరోజు నాడు అలాంటి పని చేసిన ప్రభాస్ ఫ్యాన్స్?

మెగాస్టార్ చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు తాజాగా ఘనంగా నిర్వహించారు మెగా ఫ్యామిలీ.. రామ్ చరణ్ పుట్టినరోజు సంద

Published By: HashtagU Telugu Desk
Ram Charan Prabhas

Ram Charan Prabhas

మెగాస్టార్ చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు తాజాగా ఘనంగా నిర్వహించారు మెగా ఫ్యామిలీ.. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సెలబ్రిటీలు ఆయన ఫోటోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. రామ్ చరణ్ అభిమానులు కొందరు రక్తదానం అన్నదానం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారు. సేవా కార్యక్రమాలు కూడా విస్తృతంగా నిర్వహించారు. అయితే కేవలం చెర్రీ అభిమానులు మాత్రమే కాకుండా ప్రభాస్ అభిమానులు కూడా రామ్ చరణ్ బర్త్ డే వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేశారు.

సోషల్ మీడియాలో చెర్రీకి పుట్టిన రోజు విషెస్ తెలపడమే కాకుండా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా అనాథలు, పేద పిల్లలకు ఫుడ్ ఫ్యాకెట్స్ పంపిణీ చేశారు. డార్లింగ్ ఫ్యాన్స్ తరఫున ప్రియమైన రామ్ చరణ్ కోసం అంటూ పలు చోట్ల ఫుడ్ ప్యాకెట్స్ పంచారు. ఫుడ్ బాక్సులపై రామ్ చరణ్, ప్రభాస్ కలిసున్న ఫొటోలతో పాటు హ్యాపీ బర్త్ డే మెగా పవర్ స్టార్ అని కూడా ముద్రించారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

వీటిని చూసిన రామ్‌ చరణ్ అభిమానులు ప్రభాస్ ఫ్యాన్స్ కు ధన్యవాదాలు చెబుతున్నారు. ఇక సామాన్య జనాలు కూడా వీటిని చూసి ఇది కదా అసలైన అభిమానమంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. చాలామంది ఈ విషయంపై స్పందిస్తూ అందరూ హీరోల అభిమానులు కూడా ఇలాగే ఉంటే చాలా మంచిది. అప్పుడు ఎలాంటి గొడవలు పోట్లాటలు ఉండవు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

  Last Updated: 28 Mar 2024, 07:50 PM IST