Site icon HashtagU Telugu

Prabhas : అసంతృప్తిలో ప్రభాస్ ఫ్యాన్స్.. ఇలా చేశారేంటో..!

Prabhas Fans Dissappointed For Birthday Gift

Prabhas Fans Dissappointed For Birthday Gift

Prabhas రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి ఏదో ఒక టీజర్ వస్తుందని ఆశపడ్డ అభిమానులకు నిరాశ తప్పలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూడగా సలార్ 1 నుంచి కానీ.. కల్కి (Kalki) సినిమా నుంచి కానీ ఎలాంటి టీజర్ వదల్లేదు. అందుకే రెబల్ స్టార్ ఫ్యాన్స్ కల్కి, సలార్ (Salaar) మేకర్స్ మీద ఫైర్ అవుతున్నారు.

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న సలార్ సినిమా నుంచి అప్పుడెప్పుడో ఒక గ్లింప్స్ వదిలారు. ఆ తర్వాత సినిమా రిలీజ్ డేట్ మార్చారు కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ప్రభాస్ బర్త్ డే రోజు సలార్ నుంచి టీజర్ వస్తుందని ఫ్యాన్స్ ఆశించారు కానీ ప్రశాంత్ నీల్ డిజప్పాయింట్ చేశాడు.

ఇక మరోపక్క నాగ్ అశ్విన్ (Nag Aswin) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కల్కి సినిమా నుంచి కూడా రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నాడు ఎలాంటి అప్డేట్ రాలేదు. ప్రభాస్ తో చేసే నిర్మాతలే ఇలా ఎందుకు చేస్తున్నారు అంటూ రెబల్ స్టార్ (Rebal Star) ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.

ప్రభాస్ కూడా ఫ్యాన్స్ కోరుతున్నట్టుగా టీజర్ రిలీజ్ కోసం మేకర్స్ మీద ప్రెజర్ చేయలేదు. స్టార్ హీరో బర్త్ డే అంటే టీజర్, పోస్టర్స్ తో కళకళలాడుతుంది. కానీ ప్రభాస్ విషయంలో మాత్రం అలా జరగలేదు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ అంతా కలిసి కైతలాపూర్ గ్రౌండ్ లో పెద్ద ఈవెంట్ చేశారు. మరోపక్క ఛత్రపతి సినిమా రీ రిలీజ్ చేశారు. కానీ ప్రభాస్ నటిస్తున్న సినిమాల నుంచి మాత్రం టీజర్ ని వదల్లేదు.

Also Read : Samantha : సమంతకు హ్యాండ్ ఇచ్చిన క్లోజ్ ఫ్రెండ్స్..!