Site icon HashtagU Telugu

Salaar : ధర్మవరంలో విషాదం ..ప్రభాస్ అభిమాని మృతి

Prabhas Fan Dies

Prabhas Fan Dies

ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరం (Dharmavaram) పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ (Current Shock) షాక్ కు గురై..ప్రభాస్ (Prabhas) అభిమాని మృతి చెందారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ (Salaar) మూవీ భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ పడకపోయేసరికి..అభిమానుల అంచనాలన్నీ ఈ సినిమా పైనే ఉన్నాయి. దానికి తగ్గట్లే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాను తెరకెక్కించడం..అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా థియేటర్స్ లలో రిలీజ్ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక అర్ధరాత్రి నుండే సలార్ హంగామా మొదలైంది. అభిమానులు థియేటర్స్ ను కటౌట్స్ తో నింపేశారు. ఇదిలా ఉంటె ధర్మవరం లో రంగ థియేటర్‏ ఎదుట గురువారం ఒక ఇంటిపై ఫ్లెక్సీ ప్రభాస్ అభిమాని బాలరాజు (27) విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. తమ అభిమాన హీరో నటించిన సలార్ సినిమా శుక్రవారం విడుదలకానుండడంతో ఫ్యాన్స్ అంతా ఎమోషనల్ అవుతున్నారు. మృతిచెందిన బాలరాజు దుస్తుల వ్యాపారం చేస్తున్నారు. ఆయన ప్రభాస్ వీరాభిమాని. మృతుడికి భార్య శిరీష, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాలరాజ్ మరణంతో అతని భార్య కన్నీరు మున్నీరు అయ్యింది. రంగా సినిమా హాల్ వద్ద రహదారిపై కూర్చుని మాకు న్యాయం చేయాలని మృతుడి బంధువులు ధర్నా చేస్తున్నారు. ధర్మవరం ఒకటో పట్టణ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటె హైదరాబాద్లో ప్రభాస్ ఫ్యాన్స్ హల్చల్ చేస్తున్నారు. థియేటర్ల వద్దకు తెల్లవారు జాము నుంచే చేరుకోవడంతో సందడి కనిపిస్తోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద అభిమానులు నానా హంగామా సృష్టించారు. అభిమానుల తాకిడి ఎక్కువవ్వడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభాస్ జిందాబాద్ అంటూ థియేటర్ గేటు దూకి లోపలికి అభిమానులు దూసుకెళ్లడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. వారిని అదుపు చేసేందుకు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ క్రమంలో సంధ్య థియేటర్ ఆవరణ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల వైఖరిపై అభిమానులు మండిపడుతున్నారు.

Read Also : Elections in Singareni : సింగరేణి ఎన్నికలకు బిఆర్ఎస్ దూరం..