Site icon HashtagU Telugu

Prabhas Doop Remuneration : ప్రభాస్ డూప్ కి రోజుకి ఎంత రెమ్యునరేషన్ అంటే.. దాదాపు మీడియం రేంజ్ హీరో అతనిది..!

Prabhas Doop Remuneration Shock Equal To Star Hero Remuneration

Prabhas Doop Remuneration Shock Equal To Star Hero Remuneration

Prabhas Doop Remuneration స్టార్ హీరోలు చేసే రిస్కీ ఫైట్స్ లో ఎక్కువ శాతం వారి డూప్ లు.. యాక్షన్ కొరియోగ్రాఫర్ లు పనిచేస్తారని తెలిసిందే. స్టార్ హీరోలు క్లోజప్ షాట్ వరకు తీసుకుని మిగతా అంతా కూడా డూప్ లతోనే నడిపిస్తారు. స్టార్ హీరోల డూప్ లకు కూడా డిమాండ్ ఒక రేంజ్ లో ఉంటుంది. వారు కూడా మంచి రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. మిగతా స్టార్ హీరోల డూప్ లేమో కానీ రెబల్ స్టార్ ప్రభాస్ డూప్ మాత్రం ఒక హీరో రేంజ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని తెలుస్తుంది.

ప్రభాస్ కి కొన్నాళ్లుగా డూప్ గా చేస్తున్న అతను బాహుబలి తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవ్వడంతో భారీ సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమాల్లో ప్రభాస్ డూప్ కి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలా అతను కూడా భారీగా సంపాదిస్తున్నాడట. తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రభాస్ డూప్ కి రోజుకి దాదాపు 30 లక్షల దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నారని టాక్.

అంటే 10 రోజుల యాక్షన్ సీక్వెన్స్ చేస్తే 3 కోట్ల రూపాయల దాకా అతను తీసుకుంటాడట. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రభాస్ డూప్ రెమ్యునరేషన్ చూస్తే ఒక సగటు మీడియం రేంజ్ హీరో రెమ్యునరేషన్ లానే ఉందని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ తో యాక్షన్ సీన్ చేసినప్పుడే అతని అవసరం ఉంటుంది. సో ప్రభాస్ ఎన్ని రోజులు యాక్షన్ అది కూడా రిస్కీ షాట్స్ చేస్తాడో అప్పుడే అతనికి అవకాశం ఉంటుంది. అన్ని రోజులు అతనికి పారితోషికం ఇస్తారు.

Also Read : Prince Yawar Nayani Pawani Love : ప్రిన్స్ యావర్ తో లవ్.. నయని పావని ఏమంటుంది అంటే..?