Site icon HashtagU Telugu

Pan India Star: దటీజ్ ప్రభాస్.. సాలార్ ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 500 కోట్లు?

Prabhas

హిట్స్, ఫ్లాపులతో సంబంధం లేకుండా టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. వరుసగా ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ఇక ప్రభాస్ కొత్త సినిమాల రెమ్యూనరేషన్ రూ. 150 కోట్లకి పెరిగింది. హిట్ ఫ్లాపులు రెండిటినీ సమానంగా తీసుకుని కొత్త సినిమాలు కూడా సైన్ చేస్తున్నాడు. అంతేకాదు త్వరలో విడుదల కానున్న ‘సాలార్’ డిస్ట్రిబ్యూషన్ మార్కెట్లో బంపర్ బిజినెస్ చేస్తోందని చెప్తున్నారు. బాలీవుడ్ లో ‘సాలార్’ బిజినెస్ ఆఫర్లు ‘ఆర్ ఆర్ ఆర్’ ని మించేలా వున్నాయి. దీనికి మరో కారణం కూడా వుంది.

‘కేజీఎఫ్ చాప్టర్ 2’ పానిండియా ఘన విజయం విజయం తర్వాత, దర్శకుడు ప్రశాంత్ నీల్ తర్వాత ఏం అందించబోతున్నాడో చూడడానికి ప్రతి ఒక్కరూ ఉత్సుకతతో వున్నారు. ఈసారి అతను ప్రభాస్ కాంబినేషన్ తో రావడంతో ‘సాలార్’ కి ఇంత హైప్ వచ్చింది. దీంతో ఈ యాక్షన్ థ్రిల్లర్ నిర్మాతలకి థియేట్రికల్ హక్కులకు సంబంధించి భారీ ఆఫర్లు అందుతున్నాయి.

ట్రేడ్ వర్గాల ప్రకారం ‘సాలార్’ ఎస్ ఎస్ రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ రికార్డ్-బ్రేకింగ్ ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్‌ ని కూడా అధిగమించేలా వుంది. రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ లు నటించిన ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కుల ద్వారా రూ. 500 కోట్లకి పైగా భారీ మొత్తాన్ని వసూలు చేసింది. ఈ పెరుగుతున్న క్రేజ్ కారణంగా, మేకర్స్ థియేట్రికల్ రైట్స్ కోసం కొన్ని క్రేజీ ఆఫర్లని పొందుతున్నారు. ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ సులభంగా రూ. 500 కోట్లను దాటే అవకాశముందంటున్నారు. ప్రభాస్ నటించిన ఈ హైపర్ యాక్షన్ ప్రశాంత్ నీల్ మార్కు సినిమా, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఇప్పటికే రూ. 80 కోట్లకి పైగా రాబట్టిందనే విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ రూ. 200 కోట్ల రేంజిలో జరగ వచ్చని అంటున్నారు.

Also Read: Tholi Ekadasi: రేపే తొలి ఏకాదశి.. ఆ రోజు ఏం చేయాలో మీకు తెలుసా!