Prabhas Comments: ‘టికెట్స్ ఇష్యూ’ భారీ బడ్జెట్ చిత్రాలకు ఖచ్చితంగా నష్టమే!

చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ వంటి టాలీవుడ్ పెద్దలు ఫిబ్రవరి 10న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి సినిమా టిక్కెట్ల ఇష్యూ, ఇతర సమస్యలపై చర్చించారు.

  • Written By:
  • Updated On - March 3, 2022 / 04:19 PM IST

చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ వంటి టాలీవుడ్ పెద్దలు ఫిబ్రవరి 10న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి సినిమా టిక్కెట్ల ఇష్యూ, ఇతర సమస్యలపై చర్చించారు. రాధే శ్యామ్ ప్రమోషన్స్ కోసం ముంబైలో ఉన్న ప్రభాస్‌ మీడియా ముందుకొచ్చాడు. ఈ సందర్భంగా టికెట్స్ ఇష్యూపై ఓపెన్ కామెంట్స్ చేశారు. “పెద్ద చిత్రాలకు కచ్చితంగా నష్టమే.. ఆంధ్రా, తెలంగాణ మార్కెట్లు పెద్ద మార్కెట్‌ అయితే కమర్షియల్‌గా ఆంధ్రా పెద్దది. రాధే శ్యామ్‌ లాంటి సినిమాలు తీస్తే నిర్మాతకు నష్టాన్ని కల్గించే విషయం. 40-50 శాతం మేర మాత్రమే బిజినెస్ జరిగే అవకాశాలున్నాయి. వీలైనంత త్వరగా ప్రభుత్వం మద్దతు ఇస్తే బాగుంటుంది.

బాలీవుడ్ మీడియా ప్రభాస్ చేయబోయే సినిమాల గురించి అడిగినప్పుడు.. ప్రభాస్ తన రాబోయే చిత్రాల షెడ్యూల్స్ తో గందరగోళంగా కనిపించాడు. ఇప్పటికే మూడు, నాలుగు సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. అంటే ఏడాదికి కనీసం ఒక సినిమా అయినా ప్రేక్షకులకు ముందుకొస్తుంది. అయితే ప్రభాస్ టాలీవుడ్ సినిమాలతో పాటు పాన్ ఇండియా సైతం చేస్తున్నాడు. ఇదే విషయమై ప్రభాస్ రియాక్ట్ అవుతూ.. “నేను సంవత్సరానికి 2 సినిమాలు మాత్రమే చేస్తానని అనుకున్నాను, కానీ నా అంచనాలన్నీ తప్పాయి. ఎందుకంటే గత ఏడేళ్లుగా (బాహుబలి) లాంటి సినిమాలతో బిజీగా ఉండాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఒప్పుకున్న ప్రాజెక్టులన్నీ మూడేళ్లలో కంప్లీట్ చేయాలనుకుంటున్నా’’ అని అంటున్నాడు ప్రభాస్.

రాధే శ్యామ్ మార్చి 11న పెద్ద విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ప్రభాస్ వచ్చే రెండేళ్లు 2024 వరకు అనేక ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. అతను ప్రస్తుతం దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్‌లతో కలిసి నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ K కోసం పని చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తో 25వ చిత్రం ‘స్పిరిట్’ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుందని ప్రభాస్ వెల్లడించారు.