Site icon HashtagU Telugu

Prabhas : ప్రభాస్ యాక్టింగ్ చూసి గ్రాఫిక్స్ అని ఏడిపించిన కాలేజీ ఫ్రెండ్స్..

Prabhas College Friends Comments On His Acting In Chatrapathi Movie

Prabhas College Friends Comments On His Acting In Chatrapathi Movie

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్. స్క్రీన్ పై ప్రభాస్ భారీ డైలాగ్స్, ఫైట్స్ చేసి ఓ యాక్ట్ చేయనవసరం లేదు. జస్ట్ అలా నిలబడి కనిపిస్తే చాలు.. బాక్స్ ఆఫీస్ వద్ద కోట్ల వర్షం కురిసింది అంటూ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో పాటు చాలామంది దర్శకనిర్మాతలు చెబుతూ ఉంటారు. అయితే ప్రభాస్ బాగా నటించిన ఓ సినిమా చూసి.. తన ఫ్రెండ్స్ గ్రాఫిక్స్ అని ఏడిపించారట. ఈ విషయాన్ని ప్రభాస్ స్నేహితుడే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన మొదటి మూవీ ‘ఛత్రపతి’. ఈ సినిమాతో ప్రభాస్ కి మాస్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ విజుల్స్ వేయిస్తుంది. యాక్షన్ సీన్స్ తో గుండెపిండే ఎమోషనల్ సీన్స్ ని కూడా ప్రభాస్ చాలా బాగా చేసారు. అయితే ఈ యాక్టింగ్ ని చూసిన ప్రభాస్ ఫ్రెండ్స్.. అది గ్రాఫిక్స్ అని కామెంట్స్ చేశారట. ప్రభాస్ స్నేహితులు పెద్ద క్రిటిక్స్ అంట. ఆ ఫైట్ సరిగ్గా చేయలేదు, యాక్టింగ్ చెత్తలా ఉంది, డాన్స్ కూడా సరిగ్గా చేయలేదని ప్రభాస్ ని ఎప్పుడు విమర్శిస్తూ వస్తుంటారట.

ఛత్రపతి సినిమా ముందు వరకు ప్రభాస్ ని ఎప్పుడు పొగడలేదట. పోనీ ఛత్రపతి సినిమాలో యాక్టింగ్ బాగా నచ్చి పొగిడారా అంటే.. అది కూడా విమర్శిస్తూనే పొగిడారు. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ ఫ్రెండ్స్ అందరికి బాగా నచ్చేసిందట. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ లో ప్రభాస్ యాక్టింగ్ కి వాళ్ళకి గూస్‌బంప్స్ వచ్చాయట. ఇక ఆ విషయం గురించి స్నేహితులు ప్రభాస్ తో మాట్లాడుతూ.. “ఇంటర్వెల్ సీన్ లో గ్రాఫిక్స్ బాగా ఉపయోగించారురా” అని చెప్పారట.

దానికి ప్రభాస్.. “ఇంటర్వెల్ సీన్ లో గ్రాఫిక్స్ ఎక్కడ ఉన్నాయి. గ్రాఫిక్స్ ఏమి ఉపయోగించలేదుగా” అని అడిగారట. దానికి ప్రభాస్ స్నేహితుడు బదులిస్తూ.. “లేకుంటే నువ్వు ఆ సీక్వెన్స్ లో అంత బాగా యాక్ట్ చేసావు అంటే మేము నమ్మాలా. కచ్చితంగా గ్రాఫిక్స్ ఉపయోగించే నీతో సీన్స్ చేసి ఉంటారు” అని ఏడిపించారట.