మాస్ డైరెక్టర్ వినాయక్ (VV Vinayak) పుట్టిన రోజు (Birthday) ఈరోజు. ఈ సందర్బంగా సినీ ప్రముఖులు , సినీ లవర్స్ , అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున బర్త్ డే విషెష్ అందజేస్తూ తమ అభిమానాన్ని తెలియజేస్తున్నారు. వినాయక్ అంటే తెలియని సినీ లవర్స్ ఉండరు. మాస్ చిత్రాలను తెరకెక్కించడం లో వినాయక్ దిట్ట. ఆయన సినిమాల్లో గాల్లోకి లేచిన సుమోలు, బాంబు పేలుళ్ళు గుర్తుకు వస్తాయి. ప్రతి అంశాన్ని కమర్షియల్ యాంగిల్‌లో చూసి ఆయన సన్నివేశాలను చిత్రీకరించిన తీరూ గుర్తుకు రాకమానదు. తొలి చిత్రం ‘ఆది’ మొదలు మొన్నటి ‘ఛత్రపతి ‘ (హిందీ) వరకు వినాయక్ సినిమాలను పరిశీలిస్తే, ఎలాంటి కథకైనా తనదైన కమర్షియల్ తళుకులు అద్ది, జనాన్ని ఆకట్టుకొనే ప్రయత్నం కనిపిస్తుంది. ఆ పయనంలో అదరహో అనిపించిన అపూర్వ విజయాలూ ఉన్నాయి. ఉస్సూరుమనిపించిన చిత్రాలూ లేకపోలేదు.
చిరంజీవి , ఎన్టీఆర్ , రవితేజ , ప్రభాస్, అల్లు అర్జున్ , చరణ్ ఇలా ఎంతో మంది అగ్ర హీరోలతో సినిమాలు చేసి తన మార్క్ చూపించారు. కాగా గత కొంతకాలంగా సినిమాలు చేయడం తగ్గించిన ఈయన..ఆ మధ్య ఛత్రపతి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి ఘోర ప్లాప్ ను మూటకట్టుకున్నాడు. ఆ తర్వాత ఎలాంటి సినిమా ప్రకటన చేయలేదు. ఇదే క్రమంలో ఆయన బాగా చిక్కిపోయినట్లుగా ఉన్న ఆయన లుక్ బాగా వైరల్ అయ్యింది. వినాయక్ కు ఏమైంది..? ఏమైనా అనారోగ్య సమస్యా అంటూ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. వినాయక్‌కి మేజర్ లివర్ సర్జరీ జరిగిందని.. ఆ మధ్య వార్తలు సైతం బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఆయన ఆరోగ్యానికి సంబంధించి కానీ పిక్స్ కానీ బయటకు రాలేదు.
ఇక ఈరోజు ఆయన బర్త్ డే సందర్బంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)..స్వయంగా వినాయక్ ఇంటికి వెళ్లి విషెష్ తెలిపారు. గతంలో వీరిద్దరి కలయికలో యోగి మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అనుకున్నంత విజయం దక్కకపోయినా ప్రభాస్..మాత్రం వినాయక్ తో ఉన్న స్నేహాన్ని వదులుకోలేదు. ప్రభాస్ దృష్టిలో హిట్ , ప్లాప్ అనేది అస్సలు పట్టించుకోడు. ఒక్కసారి కనెక్ట్ అయితే ఎప్పటికి సన్నిహితంగా ఉంటాడు. వీలు కుదిరినప్పుడల్లా ఫోన్ లో టచ్ లో ఉండడం , లేదా కలవడం వంటివి చేస్తుంటాడు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా మూవీస్ చేస్తూ ప్రభాస్ ఎంతో బిజీ గా ఉన్నారు. రాజాసాబ్, కల్కి 2 , సలార్ 2 , స్పిరిట్ ఇలా పలు సినిమాలు లైన్లో పెట్టాడు.
Read Also : Zakir Naik: పెళ్లి కానీ ఆడవాళ్లు..పబ్లిక్ ప్రొపర్టీ: జకీర్ నాయక్