Site icon HashtagU Telugu

Prabhas Birthday Special: నేడు పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ పుట్టిన‌రోజు.. ఈ విష‌యాలు తెలుసా?

Prabhas Birthday Special

Prabhas Birthday Special

Prabhas Birthday Special: ఉప్పలపాటి ప్రభాస్ రాజు తెలుగు నటుడు. ఇతడు ప్ర‌భాస్‌గా (Prabhas Birthday Special) సుపరిచితుడు. ప్ర‌భాస్ నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి, బాహుబలివంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు. ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు తెలుగు సినిమా నిర్మాత.

ప్రభాస్ ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, శివ కుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23 తేదీన జన్మించాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు తన కుటుంబ స్వగ్రామం. తన తల్లితండ్రులకు ఉన్న సంతానంలో రెండోవాడు. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు. ఇతను నటు..డు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. నటులు గోపిచంద్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, మంచు మనోజ్ కుమార్, రామ్ చ‌ర‌ణ్‌ ప్రభాస్ కు మంచి స్నేహితులు. ప్రభాస్ తన ప్రాథమిక విద్యను డి.ఎన్.ఆర్ స్కూల్ భీమవరంలో పూర్తిచేశారు. బి .టెక్ ఇంజినీరింగ్ కాలేజ్ శ్రీ చైతన్య హైదరాబాద్ లో పూర్తిచేశారు.

Also Read: Priyanka Gandhi : వయనాడ్‌లో ప్రియాంకాగాంధీ నామినేషన్.. రాహుల్ ఏమన్నారంటే..

2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేసాడు. ఈ సినిమా నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవికి కూడా తెలుగులో ఇది తొలి సినిమా. ఈ సినిమా విజయం సాధించినా ఆ తర్వాత 2003లో విడుదలైన రాఘవేంద్ర సినిమా పరాజయం పాలైంది. 2004లో త్రిష సరసన నటించిన వర్షం సినిమా ప్రభాస్ కు మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించింది. ఆ తర్వాత ప్రభాస్ అడవి రాముడు, చక్రం సినిమాల్లో నటించాడు. ఈ సినిమాల ద్వారా ప్రభాస్ కు నటుడిగా మంచి గుర్తింపు లభించినా పరాజయం పాలయ్యాయి. 2005లో ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ శ్రియా సరసన ఛత్రపతి సినిమాలో నటించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి ప్రభాస్ ను తెలుగులో ఒక నటుడిగా నిలబట్టింది. కానీ ఆ తర్వాత విడుదలైన పౌర్ణమి, యోగి సినిమాలు పరాజయం చెందాయి. ఆ తర్వాత ప్రభాస్ ఇలియానా సరసన పైడిపల్లి వంశీ దర్శకత్వంలో మున్నా సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. 2008లో పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో త్రిష సరసన తన కెరియర్ లో రెండో సారి బుజ్జిగాడు సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా విజయం సాధించింది.

2012లో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తమన్నా, దీక్షా సేథ్ దర్శకత్వంలో రెబెల్ సినిమాలో నటించాడు ప్రభాస్. ఈ సినిమా కథ బాగున్నప్పటికి పరాజయం పాలైంది. 2013లో రచయిత కొరటాల శివ దర్శకత్వంలో మిర్చి సినిమాలో నటించాడు. ఈ సినిమాలో అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ కథానాయికలు. ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకొవటంతో పాటు ప్రభాస్ ను ఒక కొత్తగా చూపించడం జరిగింది. ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో అనుష్క, రానా దగ్గుబాటి లతో కలసి బాహుబలి సినిమాలో నటించాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది. అందులో మొదటి భాగం “బాహుబలి – ది బిగినింగ్” తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో జూలై 10 న భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలై, భారత చలనచిత్ర రంగంలో ఇంతవరకు నమోదు చేయని కలెక్షన్లను వసూలు చేసి అఖండ విజయం సాధించింది. రెండవ భాగం పనులు పూర్తి చేసుకొని 2017 ఏప్రిల్ 28న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన చిత్రం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో ప్రభాస్ అంతర్జాతీయంగా పేరు సంపాదించాడు.

ఆ త‌ర్వాత తీసిన సాహో, రాధే శ్యామ్‌, ఆదిఫురుష్ మూవీలు ఆశించిన స్థాయిలో ఆడ‌లేదు. ఆ త‌ర్వాత తీసిన స‌లార్‌, క‌ల్కి మూవీలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌లుగా నిలిచాయి. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ రాజా సాబ్ మూవీతో బిజీగా ఉన్నాడు. ఆ త‌ర్వాత స‌లార్ 2, క‌ల్కి పార్ట్ 2ల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.