Site icon HashtagU Telugu

Salaar Success Celebrations : సలార్ సక్సెస్ సంబరాలు..ప్రభాస్ ఫుల్ హ్యాపీ

Salaar Success

Salaar Success

బాహుబలి (Baahubali) తర్వాత ప్రభాస్ (Prabhas) కు సరైన హిట్ పడలేదు..ఈ క్రమంలో KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన సలార్ (Salaar) సిరీస్ పైనే అందరి అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 22 న ఈ సినిమా తాలూకా పార్ట్ 1 వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. తెలుగు ఆడియన్స్ కు కాస్త సినిమా ఎక్కకపోయిన..మిగతా భాషల్లో సినిమా బాగా ఎక్కింది. తెలుగు లో టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఒక్కసారైనా సినిమా చూడాలని థియేటర్స్ కు క్యూ కట్టారు. దీంతో మొదటి వారంలో పలు రికార్డ్స్ నమోదు చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం సినిమా క్లోసింగ్ కు రావడం తో మేకర్స్ సక్సెస్ సంబరాలు చేసుకున్నారు. బాహుబలి తరువాత అందుకున్న అతిపెద్ద విజయం సలార్ అనే చెప్పాలి. ప్రభాస్ కటౌట్ ని కరెక్ట్ గా వాడుకుంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో సలార్ సీజ్ ఫైర్ చూపించింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ. 625 కోట్లు రాబట్టి రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో మేకర్స్ సక్సెస్ సంబరాలను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో చిత్ర యూనిట్ మొత్తం పాల్గొని కేక్ ను కట్ చేశారు. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హోంబలే నిర్మాతలు కలిసి కేక్ కట్ చేశారు. చాలా గ్యాప్ తరువాత ప్రభాస్ ఈ సెలబ్రేషన్స్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఎప్పటిలానే ఇప్పుడు కూడా ప్రభాస్ బ్లాక్ అండ్ బ్లాక్ లోనే దర్శనమిచ్చాడు. బ్లాక్ కలర్ హూడీ పై బ్లాక్ కలర్ హెయిర్ క్యాప్ వైట్ గ్లాసెస్ తో కూల్ లుక్ లో కనిపించగా.. పృథ్వీరాజ్ సైతం బ్లాక్ కలర్ షర్ట్ లో మెరిశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోహాల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Read Also : Vijay – Rashmika Engagement : క్లారిటీ వచ్చేసిందోచ్..!!